Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ పథకం.. రైతులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 13వరకే అవకాశం..

అర్హత ఉన్నా అందులో తమ పేరు లేని వారు రైతు సేవా కేంద్రంలో అర్జీతో పాటు పత్రాలు సమర్పించాలి.

Annadata Sukhibhava Scheme

Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హుల జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసింది. అర్హుల జాబితాను రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచినట్లు వ్యవసాయశాఖ డైరెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. అన్నదాత సుఖీభవ స్కీమ్ కి సంబంధించి రైతులకు బిగ్ అలర్ట్. జాబితాలో పేరు లేని రైతులు సేవా కేంద్రంలో అర్జీలు అందజేయొచ్చని చెప్పారు. అలాగే అన్నదాత సుఖీభవ పోర్టల్ లోని గ్రీవెన్స్ మాడ్యూల్ లోనూ ఫిర్యాదు చేయొచ్చని వెల్లడించారు. అందుకు ఈ నెల 13వరకు అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.

‘‘అన్నదాత సుఖీభవ పోర్టల్‌, మన మిత్ర వాట్సప్‌లో ఆధార్‌ నంబర్‌ ద్వారా రైతులు అర్హతను తెలుసుకోవచ్చు. ఆధార్‌ నంబర్‌ను మన మిత్ర వాట్సప్‌ నంబర్‌ 95523 00009కు పంపితే వివరాలు తెలుస్తాయి. అర్హత ఉన్నా అందులో తమ పేరు లేని వారు రైతు సేవా కేంద్రంలో అర్జీతో పాటు పత్రాలు సమర్పించాలి. అన్నదాత సుఖీభవ పోర్టల్‌లోని గ్రీవెన్స్‌ మాడ్యూల్‌లోనూ ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదు చేసేందుకు ఈ నెల 13 వరకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది’’ అని వ్యవసాయశాఖ డైరెక్టర్ ఢిల్లీరావు చెప్పారు. అన్నదాత సుఖీభవ పథకం కింద ఈ నెలలోనే రూ.7వేలు రైతుల ఖాతాల్లో జమ చేయనుంది ప్రభుత్వం.

Also Read: పరిధి దాటిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాజకీయ విమర్శ.. మహిళ అని చూడకుండా అడ్డగోలు మాటలు

రైతులకు కోసం ఏపీ ప్రభుత్వం ప్రకటించిన స్కీమ్ అన్నదాత సుఖీభవ. ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకాలను కలిపి మలు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు పెట్టుబడి సాయం అందించి తద్వారా ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చింది. చిన్న, సన్నకారు రైతులు, కౌలు రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. ఈ స్కీమ్ కింద ఒక్కో రైతుకు ఏటా రూ. 20 వేలు అందించనున్నారు. ఇందులో కేంద్రం వాటా రూ.6 వేలు కాగా రాష్ట్రం వాటా రూ. 14 వేలు. 3 విడతలుగా ఈ మొత్తాన్ని జమ చేస్తారు. కేంద్రం పీఎం కిసాన్‌ కింద ఇచ్చే రూ. 6 వేలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు కలిపి మొత్తం రూ. 20వేలు ఆర్థికసాయం అందిస్తుంది.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద కేంద్రం ఏటా 6వేల రూపాయలు 3 విడతలుగా (ఒక్కో ఇన్‌స్టాల్‌మెంట్‌లో 2వేలు) రైతుల ఖాతాకు జమ చేస్తుంది. పీఎం కిసాన్ నిధుల విడుదల సమయంలో ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ పథకం డబ్బులను విడుదల చేయాలని నిర్ణయించింది. అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్‌ పథకంలో భాగంగా తొలి విడత డబ్బు ఈ నెలలోనే విడుదల కానుంది.