MMBS SEATS
AP MBBS Seats : మెడికల్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలో మరో 850 ఎంబీబీఎస్ సీట్లు పెంచనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 5 వేలకుపైగా ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, వచ్చే విద్యాసంవత్సరం నుంచి మరో 850 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. 2024-25 విద్యా సంవత్సరం నుంచి పాడేరు, పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లెలో కొత్త కాలేజీల ద్వారా 750 సీట్లు, అనంతపురం, శ్రీకాకుళం, నెల్లూరు కాలేజీల్లో 100 సీట్లు పెంచుకునేందుకు అధికారులు ఎన్ఎంసీకి దరఖాస్తు చేశారు. 2025-26లో మరో 7 మెడికల్ కాలేజీలను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ఏపీలో వైద్య విద్య అవకాశాలు మెరుగుపర్చే ప్రక్రియలో భాగంగా కొత్తగా 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభం అయ్యాయి. రానున్న రెండేళ్లలో మరో 12 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే నేషనల్ మెడికల్ కమిషన్(ఎంఎంసీ)కు ఏపీ ప్రభుత్వం దరఖాస్తు చేసింది.
జిల్లాకు ఓ మెడికల్ కాలేజీ ఉండేలా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. రూ.8,400 కోట్ల ఖర్చుతో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారు. 17 మెడికల్ కాలేజీల ద్వారా 2,550 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఈ విద్యా సంవత్సరం నుంచి 5 మెడికల్ కాలేజీల ప్రారంభం కావడంతో 750 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇక 2024-25 విద్యా సంవత్సరం నుంచి పాడేరు, పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లె మెడికల్ కాలేజీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.
ఇక్కడి వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేసింది. ఇప్పటికే ఈ కాలేజీల్లో 750 ఎంబీబీఎస్ సీట్ల మంజూరుకు నేషనల్ మెడికల్ కమిషన్ కు ఏపీ ప్రభుత్వం దరఖాస్తు చేసింది. ఇక 2025-26 విద్యా సంవత్సరం నుంచి మరో 7 మెడికల్ కాలేజీలు ప్రారంభం కానున్నాయి.
CM Jagan : సీఎం జగన్ సంచలన నిర్ణయం, వైసీపీలో భారీ మార్పులు
ఇవి కాకుండా ఇప్పటికే అందుబాటులోకి ఉన్న అనంతపురం మెడికల్ కాలేజీలో 50, నెల్లూరులో 25, శ్రీకాకుళంలో 25 చొప్పున మరో 100 మెడికల్ సీట్ల పెంపుకు ఎన్ఎంసీకు ప్రభుత్వం దరఖాస్తు చేసింది. అందుకనుగుణంగా బెడ్స్, ఇతర సదుపాయాలు కల్పించడంతో ఎన్ఎంసీ ఇన్ స్పెక్షన్లలో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకపోచ్చు. వైద్య విద్యకు ఇప్పుడు ఇస్తుంన్నంత ప్రాధాన్యత గతంలో ఎప్పుడూ లేదు.