CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. రాష్ట్రంలో లక్షలాది మంది రైతు కుటుంబాలకు శుభవార్త
కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో రైతు భరోసా స్కీం కింద రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పింది. ఏటా రైతులకు ఎకరానికి రూ. 15వేలు పెట్టుబడి సాయం అందజేస్తామని హామీ ఇచ్చింది.

Revanth Reddy
Rythu Bandhu : తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. రైతులకు యాసంగి సీజన్ కోసం రైతు బంధు నిధులు విడుదలకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో నేటి నుంచే రైతు బంధు నిధులు విడుదల ప్రక్రియ మొదలు కానుంది. ఫలితంగా సుమారు సుమారు 70లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం అందనుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రతీయేటా ఎకరాకు రూ. 10వేలు చొప్పున రెండు విడుతల్లో రైతుల ఖాతాల్లో నిధులు జమ అయిన విషయం తెలిసిందే. ఈ ఏడాదిలో యాసంగికి సంబంధించి నిధులు డిసెంబర్ నెలలోనే జమ కావాల్సి ఉంది. అయితే, ఈసీ నిర్ణయంతో నిధుల జమకు బ్రేక్ పడింది.
Also Read : Jeevan Reddy : అలాంటి వారికి డబ్బులు ఎందుకు? రైతుబంధుపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
నవంబర్ నెలలోనే రైతు బంధు నిధులు విడుదల చేసేందుకు గత ప్రభుత్వం సిద్ధమైంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఈసీ నిధుల విడుదలకు బ్రేక్ వేసింది. ప్రభుత్వం ప్రత్యేక విజ్ఞప్తితో నవంబర్ చివరి వారంలో నిధుల విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో రైతు బంధు గురించి ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సూచించింది. కానీ, బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు రైతు బంధు విషయంపై ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించారు. హరీష్ రావు వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న ఈసీ నిధుల విడుదలకు బ్రేక్ వేసింది. ఆ తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. సోమవారం వ్యవసాయ శాఖపై తెలంగాణ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంను రేవంత్ నిర్వహించారు. ఈ సమావేశంలో రైతు బంధు నిధుల విడుదలపై చర్చకు వచ్చింది.
Also Read : Janardhan Reddy : TSPSC ఛైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా, సీఎం రేవంత్ రెడ్డితో భేటీ తర్వాత నిర్ణయం
యాసంగి సాయానికి సంబంధించి రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం నుంచే రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లో జమచేసే ప్రక్రియను ప్రారంభించాలని అధికారులకు సూచించారు. ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలుగకుండా పంట పెట్టుబడి సహాయం అందించాలని రేవంత్ అన్నారు. అయితే, గత ప్రభుత్వంలో ఇచ్చినట్లుగానే ఎకరానికి రూ. 5వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయాలని రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.
ఇదిలాఉంటే కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో రైతు భరోసా స్కీం కింద రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పింది. ఏటా రైతులకు ఎకరానికి రూ. 15వేలు పెట్టుబడి సాయం అందజేస్తామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ దఫా ఎకరాకు రూ. 7,500 రైతుల ఖాతాల్లో జమ అవుతుందని రైతులు భావించారు. కానీ, గత ప్రభుత్వం మాదిరిగానే అర్హులైన రైతుల ఖాతాల్లో నేటి నుంచి ఎకరాకు రూ. 5వేలు చొప్పున జమ కానున్నాయి.