Three Capitals : తిరుపతిలో మరో సభ…మూడు రాజధానులకు మద్దతు

ఈ స‌భ‌ను విజ‌య‌వంతం చేయాల‌ని కోరుతూ ఇప్పటికే తిరుప‌తిలో రాయ‌ల‌సీమ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులు, అధ్యాప‌కులు, మేధావుల‌తో .. భారీ ర్యాలీ నిర్వహించారు.

Rayalaseema

Rayalaseema Intellectual Forum : ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో మరో మహాసభ జరుగనుంది. అమరావతి రైతులు శుక్రవారం బహిరంగసభ నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనికి పోటీగా…మరో మహాసభ జరుగనుంది. 2021, డిసెంబర్ 18వ తేదీ శనివారం తిరుపతిలో అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ నినాదం మార్మోగ‌నుంది. మూడు రాజ‌ధానుల‌కు మ‌ద్దతుగా ఈ సభ జరుగుతోంది. రాయ‌ల‌సీమ‌కు హైకోర్టు ఇవ్వడంతో పాటు .. ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల‌ను స‌మ‌దృష్టితో అభివృద్ధి చేయాల‌నే నినాదంతో .. ఇందిరా మైదానంలో భారీ బ‌హిరంగ స‌భ నిర్వహిస్తున్నారు. ఈ స‌భ‌ను విజ‌య‌వంతం చేయాల‌ని కోరుతూ ఇప్పటికే తిరుప‌తిలో రాయ‌ల‌సీమ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులు, అధ్యాప‌కులు, మేధావుల‌తో .. భారీ ర్యాలీ నిర్వహించారు.

Read More : UP Polls : యూపీలో మోదీ సుడిగాలి పర్యటనలు

సీమ శ్రేయోభిలాషులు అందరిని ఒక వేదికపైకి తీసుకువచ్చి.. సభ నిర్వహిస్తోంది రాయలసీమ మేధావుల ఫోరం. అభివృద్ధి వికేంద్రీకరణతోనే రాయలసీమ సమగ్రాభివృద్ధి అన్న అంశాలపై ప్రముఖులు, మేధావులు సభలో ప్రసంగించనున్నారు. ఈ సభకు రచయితలు కార్మిక, కర్షక సంఘ నేతలు, న్యాయవాదులతో పాటు ఉత్తరాంధ్ర పోరాట సమితి అధ్యక్షుడు రాజాగౌడ్‌, నేషనల్‌ కాపు ఫ్రంట్‌ అధ్యక్షుడు శ్రీహరి, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి పోరాట సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కొణిజేటి రమేశ్‌.. అభివృద్ధి వికేంద్రీకరణ, రాయలసీమ అభివృద్ధి, ఆవశ్యకతను విశదీకరించనున్నారు.

Read More : Corona Cases : ఇండియా కరోనా అప్డేట్

ఇటు మూడు రాజధానులే వైసీపీ ప్రభుత్వ నిర్ణయమమని మరోసారి స్పష్టం చేశారు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి. త్వరలోనే అసెంబ్లీలో త్రీ క్యాపిటల్‌ బిల్లు ప్రవేశపెడతామని తెలిపారు. టీడీపీ దగ్గర ఉండి మరీ.. అమరావతి ఉద్యమాన్ని నడిపిస్తోందని ఆరోపించారు. అది రైతుల ఉద్యమం కాదన్నారు పెద్దిరెడ్డి. తిరుపతి సభలో ఉత్తరాంధ్ర, రాయలసీమ గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు.. వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్‌. చంద్రబాబు దృష్టిలో రాజధాని అంటే భూములు మాత్రమేనా అని ప్రశ్నించారు.