రాజధాని రచ్చ : టైర్లు కాల్చేశారు..రోడ్లకు అడ్డంగా వాహనాలు

టైర్లు కాల్చేస్తున్నారు..రోడ్లకు అడ్డంగా వాహనాలు..అడ్డంగా సిమెంటు బళ్లలు పెట్టేస్తున్నారు..మూడు రాజధానులంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనపై అగ్గిమీదగుగ్గిలమౌతున్నారు అమరావతి ప్రజలు. ఈ క్రమంలో…GN RAO కమిటీ నివేదిక రావడంతో ఆందోళనలు మరింత ఉధృతం చేశారు. 29 గ్రామాల రైతులు ఆందోళనలకు పిలుపునిచ్చారు. రాజధానిని మారిస్తే ప్రాణ త్యాగాలకైనా సిద్ధమంటూ నినాదాలు చేశారు.
2019, డిసెంబర్ 21వ తేదీ శనివారం నాలుగో రోజు రైతులు ఆందోళనలు కొనసాగించారు. ప్రజలు స్వచ్చందంగా రోడ్లెక్కారు. మహిళలు, విద్యార్థులు, రైతులు, ప్రజా సంఘాలు కదం తొక్కుతున్నారు. రహదారుల దిగ్భందనం చేశారు. జాతీయ రహదారిపై రైతులు అర్ధనగ్నంగా బైఠాయించారు. రాయపూడి, మందడం, తుళ్లూరు ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.
కేవలం తగదా పెట్టడానికే ఇదంతా చేస్తున్నారని, అసలు కమిటీ ఎందుకని నిలదీశారు. రోడ్లకు అడ్డంగా వాహనాలు పెట్టడంతో రాకపోకలు స్తంభిస్తున్నాయి. కమిటీ ఎవరి అభిప్రాయాలు తీసుకోలేదని, ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. GN RAO కమిటీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
* రాజధాని గ్రామాల్లో భారీగా పోలీసులు మోహరించారు.
* రాయపూడిలో వంటావార్పు ద్వారా రైతుల నిరసన.
* వెలగపూడిలో రైతుల రిలే నిరహార దీక్ష.
* అమరావతి రైతులు భగ్గుమంటున్నారు.
* మందడంలో రోడ్డుపై టైర్లు తగులపెట్టిన రైతులు.
Read More : రాజధాని మంటలు : సీఎం జగన్ రాజీనామా చేయాలి