ఏపీలో కూటమి హవా.. ట్విటర్ లో మంత్రి రోజా వేదాంతం..

మంత్రి రోజా తన ట్విటర్ ఖాతాలో చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోను షేర్ చేశారు. భయాన్ని విశ్వాసంగా.. ఎదురు దెబ్బలను మెట్లుగా..

ఏపీలో కూటమి హవా.. ట్విటర్ లో మంత్రి రోజా వేదాంతం..

YCP Leader Roja

Updated On : June 4, 2024 / 11:58 AM IST

YCP Leader Roja : ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి హవా కొనసాగుతుంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు 150కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మంత్రులు ఇద్దరుముగ్గురు మినహా మిగిలినవారంతా ఓటమి బాటలో పయనిస్తున్నారు. నగరి నియోజకవర్గంలో మంత్రి రోజా కూడా ఓటమి దిశగా పయనిస్తున్నారు. అయితే, ఏపీలో కూటమి హవా కొనసాగుతున్న వేళ మంత్రి రోజా తన ట్విటర్ ఖాతాలో ఆసక్తికర ట్వీట్ చేశారు.

Also Read : Ambati Rayudu : ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై అంబ‌టి రాయుడు ట్వీట్‌.. ఏపీకి మంచి రోజులు వ‌చ్చాయ్‌..

మంత్రి రోజా తన ట్విటర్ ఖాతాలో చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోను షేర్ చేశారు. భయాన్ని విశ్వాసంగా.. ఎదురు దెబ్బలను మెట్లుగా.. మన్నింపులను నిర్ణయాలుగా.. తప్పులను పాఠంగా నేర్చుకుని, మార్చుకునే వాళ్లే శక్తిమంతమైన వ్యక్తులుగా మారుతారు. అని రోజా ట్వీట్ లో పేర్కొన్నారు. రోజా ట్వీట్ పై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.