అనర్హత పిటిషన్.. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల వినతిని తిరస్కరించిన స్పీకర్

నోటీసులతో పాటు అటాచ్ మెంట్లుగా ఇచ్చిన పేపర్, వీడియో క్లిప్పింగుల ఒరిజనల్ కాపీలను వాట్సాప్ ద్వారా వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు పంపామని స్పీకర్ పేషీ వెల్లడించింది.

YCP Rebel MLAs (Photo : Google)

YCP Rebel MLAs : అనర్హత పిటిషన్లపై రిప్లై ఇవ్వడానికి 30 రోజుల సమయం కావాలన్న వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల వినతిని తిరస్కరించారు ఏపీ అసెంబ్లీ స్పీకర్. ఈ మేరకు నలుగురు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు సమాచారం అందించింది స్పీకర్ పేషీ. 30 రోజుల సమయం ఇవ్వడం కుదరదని వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల స్పష్టం చేశారు స్పీకర్. నోటీసులతో పాటు అటాచ్ మెంట్లుగా ఇచ్చిన పేపర్, వీడియో క్లిప్పింగుల ఒరిజనల్ కాపీలను వాట్సాప్ ద్వారా వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు పంపామని స్పీకర్ పేషీ వెల్లడించింది.

అనర్హత పిటిషన్లపై ఈ నెల 29న మధ్యాహ్నం 12 గంటలకు హాజరు కావాలని వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ పేషీ నోటీసులు. వైసీపీ రెబెల్స్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవికి నోటీసులు పంపారు స్పీకర్.

Also Read : పొత్తుపై స్వరం మార్చిన పవన్.. తాను చెప్పాల్సింది క్లారిటీగా చెప్పేశారా!

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీకి అనుకూలంగా ఓటు వేయడంతో ఆ పార్టీ అభ్యర్థి గెలుపొందారు. దీంతో వైసీపీ అలర్ట్ అయ్యింది. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఈసారి అలాంటి అవకాశం ఇవ్వకూడదని పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఆ నలుగురిపై అనర్హత వేటు దిశగా చర్యలు మొదలు పెట్టింది. వైసీపీ ఫిర్యాదు ఆధారంగా ఆ నలుగురికి స్పీకర్ నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులకు రిప్లయ్ ఇచ్చేందుకు 30 రోజుల సమయం కావాలని వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ కు లేఖ రాశారు. తాజాగా దీనిపై స్పందించిన స్పీకర్.. వారి వినతిని తిరస్కరించారు.

Also Read : టీడీపీకా? జనసేనకా? చంద్రబాబుకి తలనొప్పిగా మారిన విజయవాడ వెస్ట్‌ సెగ్మెంట్

అటు.. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేల వ్యవహారంపైనా రగడ జరుగుతోంది. ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి, వాసుపల్లి గణేశ్ టీడీపీ టికెట్ పై గెలిచి వైసీపీ పంచన చేరారు. ఆ తర్వాత వారు వైసీపీ ఎమ్మెల్యేలుగానే చెలామణి అవుతున్నారు. ఈ క్రమంలో ఆ నలుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతోంది పిటిషన్ దాఖలు చేసింది టీడీపీ.

ట్రెండింగ్ వార్తలు