Sunil Deodhar : ఏ క్షణమైనా.. సీఎం జగన్ బెయిల్ రద్దు కావొచ్చు, ఏపీ బీజేపీ ఇంచార్జ్ సంచలనం

ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబులపై బీజేపీ రాష్ట్ర సహ ఇంచార్జ్ సునీల్ దేవ్ ధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Sunil Deodhar : ఏ క్షణమైనా.. సీఎం జగన్ బెయిల్ రద్దు కావొచ్చు, ఏపీ బీజేపీ ఇంచార్జ్ సంచలనం

Sunil Deodhar

Updated On : April 3, 2021 / 1:53 PM IST

Sunil Deodhar : ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబులపై బీజేపీ రాష్ట్ర సహ ఇంచార్జ్ సునీల్ దేవ్ ధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రౌడీరాజ్యం నడుస్తోందని ఆయన అన్నారు. బెయిల్ పై బయట ఉన్న వ్యక్తి సీఎంగా కొనసాగుతున్నారని చెప్పారు. అంతేకాదు, జగన్ బెయిల్ ఏ క్షణమైనా రద్దయ్యే అవకాశం ఉందని ఆయన జోస్యం చెప్పారు. అటు టీడీపీ చీఫ్ చంద్రబాబుపైనా సునీల్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు కోర్టు నుంచి స్టే లు తెచ్చుకుని రాజకీయం చేస్తున్నారని చెప్పారు. భవిష్యత్తులో ఆయన కూడా జైలుకి వెళ్తారని సునీల్ దేవ్ ధర్ అన్నారు.

హాట్ కామెంట్స్ చేయడంలో సునీల్ దేవ్ ధర్..నిత్యం ముందుంటారు. ప్రత్యర్థులపై తనదైన శైలిలో విరుచుకుపడతారు. బోల్డ్ కామెంట్స్ చేయడంలో దిట్టగా పేరుంది. ఏపీలో బలపడేందుకు బీజేపీ స్కెచ్ వేస్తోంది. ఇందులో భాగంగా ప్రత్యర్థులను టార్గెట్ చేస్తోంది. సీఎం జగన్ బెయిల్ గురించి సునీల్ దేవ్ ధర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇందులో ఏదైనా మతలబు ఉందా? లేక.. బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోందా? అనే చర్చ నడుస్తోంది.