Ap Budget One Day Assembly
AP Budget : అసెంబ్లీలో తొలిసారి జగన్ ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఆమోదించనుంది. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందుగా సెక్రటేరియట్‌లో ఉదయం 8 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగనుంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. 2012, మే 20వ తేదీ గురువారం ఉదయం 9 గంటలకు ఉభయ సభలను ఉద్ధేశించి గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ వర్చువల్ పద్దతిలో ప్రసంగించనున్నారు. కోవిడ్ తీవ్రంగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు.
గవర్నర్ ప్రసంగం తర్వాత 2021-22 పద్దును ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సభలో ప్రవేశపెడతారు. ఇప్పటికే మూడు నెలల కాలానికి 70 వేల 9 వందల 83 కోట్లకు పైగా అంచనాతో ఓటాన్ ఎకౌంట్‌ను ఆర్డినెన్స్ రూపంలో ఆమోదించింది ప్రభుత్వం. మిగిలిన 9 నెలల కాలానికి పద్దును ఉభయ సభల్లో ప్రవేశపెట్టనుంది సర్కార్. కరోనా విజృంభణతో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు, బడ్జట్ ప్రవేశపెట్డడం,ఆమోదం తెలుపడం అన్నీ కార్యక్రమాలు ఒక్కరోజులోనే జరుగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
రెండో ఏడాది కూడా ఏపీ బడ్జెట్ సమావేశాలపై కరోనా ప్రభావం చూపింది. గత ఏడాది కరోనా కారణంగా ప్రభుత్వ అంచనాల మేరకు ఆదాయం రాలేదు. సెకండ్ వేవ్‌తో కూడా ఖజానాకు రాబడులు తగ్గాయి. ప్రతీ ఏడాది బడ్జెట్ అంచనాలు 15 శాతం వరకు పెంచుతూ ఉంటారు…కానీ ఈ సారి బడ్జెట్ అంచనాలు పెద్దగా పెరిగేలా లేవు. 2 లక్షల 28 వేల కోట్ల రూపాయల నుంచి 2 లక్షల 38 వేల కోట్ల వరకు బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. కరోనా కారణంగా 2020-21 ఆర్ధిక సంవత్సరానికి ఆదాయ, వ్యయాల మధ్య భారీ అంతరం ఏర్పడింది.
గత ఏడాది ఒక లక్షా 81 వేల 936 కోట్లు వ్యయం కాగా.. ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం కేవలం 77 వేల 560 కోట్లు మాత్రమే. లోటు ఒక లక్షా 4 వేల 3 వందల 83 కోట్లు రుపాయిలుగా ఉంది. ఏకంగా ఒక ఏడాదిలో లక్ష కోట్లకుపైగా లోటు రాష్ట్ర చరిత్రలో మొదటిసారి అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఈ లోటును కూడా కేంద్రం ఇచ్చిన గ్రాంట్లు, వివిధ రూపాల్లో తీసుకు వచ్చిన అప్పులు ద్వారా నెట్టుకొచ్చారు. తాజాగా తీసుకున్న అప్పులు తీర్చడంతో పాటు సంక్షేమానికి కావాల్సిన నిధులు ఈ ఆర్ధిక సంవత్సరంలో సమకూర్చుకోవాల్సి ఉంటుంది. గత ఏడాది లక్ష కోట్ల లోటు..ఈ ఏడాదికి మొత్తం వ్యయంతో 3 లక్షల కోట్ల రూపాయలకు చేరుకునే అవకాశం ఉందని ఆర్ధిక వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కరోనా కారణంగా అసెంబ్లీలో మీడియాపై పలు ఆంక్షలు విధించారు. వయో వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు సభకు హాజరవడం లేదు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఉభయ సభలను బహిష్కరించింది. మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఎలాంటి చర్చకు తావులేని సమావేశాలు కాబట్టే బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది టీడీపీ. అయితే బడ్జెట్ సమావేశాలకు సమాంతరంగా రెండు రోజులు వర్చువల్‌గా టీడీపీ మాక్ అసెంబ్లీ నిర్వహించనుంది. గురువారం సాయంత్రం నాలుగు గంటల నుంచి 6 గంటల మధ్య, శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాక్ అసెంబ్లీ నిర్వహించనున్నారు.అసెంబ్లీలో తొలిసారి జగన్ ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఆమోదించనుంది. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందుగా సెక్రటేరియట్‌లో ఉదయం 8 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగనుంది.
Read More :Priest Robbed Mangalasutra : పెళ్లి జరిపించాల్సిన పురోహితుడే.. మంగళసూత్రం మాయం చేశాడు