Priest Robbed Mangalasutra : పెళ్లి జరిపించాల్సిన పురోహితుడే.. మంగళసూత్రం మాయం చేశాడు

వేద మంత్రాలు, అగ్ని సాక్షిగా పెళ్లి జరిపించాల్సిన పురోహితుడే.. మంగళసూత్రాన్ని మాయం చేశాడు. వధూవరులతో ఏడడుగులు వేయించాల్సిన పురోహితుడే.. తాళిని దొంగిలించి కనిపించకుండా పోయాడు. ఓవైపు వేద మంత్రాలను ఉచ్చరిస్తూనే మరోవైపు మూడు తులాల బంగారం పుస్తెల తాడుని తస్కరించాడు. మెదక్ జిల్లా తూప్రాన్ లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది.

Priest Robbed Mangalasutra : పెళ్లి జరిపించాల్సిన పురోహితుడే.. మంగళసూత్రం మాయం చేశాడు

Preist Robbed Mangalasutra

Priest Robbed Mangalasutra : వేద మంత్రాలు, అగ్ని సాక్షిగా పెళ్లి జరిపించాల్సిన పురోహితుడే.. మంగళసూత్రాన్ని మాయం చేశాడు. వధూవరులతో ఏడడుగులు వేయించాల్సిన పురోహితుడే.. తాళిని దొంగిలించి కనిపించకుండా పోయాడు. ఓవైపు వేద మంత్రాలను ఉచ్చరిస్తూనే మరోవైపు మూడు తులాల బంగారం పుస్తెల తాడుని తస్కరించాడు. మెదక్ జిల్లా తూప్రాన్ లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది.

తూప్రాన్ పురపాలక పరిధిలో పడాల పల్లికి చెందిన మునిరాతి పెంటయ్య, సుశీల దంపతుల కుమారుడు జ్ఞానేందర్ దాస్ కు.. నర్సాపూర్ మండలం గొల్లపల్లికి చెందిన వసంతతో ఈ నెల 16న పడాలపల్లిలో వివాహం జరిగింది. వివాహం చేసేందుకు గజ్వేల్ కు చెందిన పురోహితుడిని మాట్లాడుకున్నారు. పెళ్లి తంతు ప్రారంభించిన పురోహితుడి దృష్టి బంగారు పుస్తెల తాడుపై పడింది. అంతే, ఓవైపు మంత్రాలు చదువుతూనే మరోవైపు.. మండపంలో వధూవరులు, బంధువుల దృష్టిని మరల్చి బంగారం పుస్తెలతాడును జేబులో వేసుకున్నాడు. కాగా, పురోహితుడు ఆ చైన్ ను దొంగలిస్తున్న దృశ్యం.. పెళ్లిని చిత్రీకరిస్తున్న వీడియోలో రికార్డ్ అయ్యింది.

వరుడు వధువు మెడలో తాళికట్టిన తర్వాత పురోహితుడు కంగారు పడుతూ ఏదో పని ఉన్నట్లుగా వివాహ మండపంలో మిగతా కార్యక్రమాలు పూర్తి చేయకుండానే హడావుడిగా వెళ్లిపోయాడు. ఆయన వెళ్లిన తర్వాత వధూవరులు బంగారు వస్తువులను పరిశీలించగా షాక్ తిన్నారు. వధువు పుస్తెల తాడు కనిపించ లేదు. హడావుడిగా వెళ్లిపోయిన పురోహితుడిపై వారికి అనుమానం వచ్చింది. వెంటనే అతడికి ఫోన్ చేసి ఆరా తీసేందుకు ప్రయత్నించగా, ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో గజ్వేల్ లోని అతని ఇంటికి వెళ్లగా ఆయన తల్లి పొంతన లేని సమాధానమిచ్చింది. ఆ తర్వాత వారు పెళ్లి వీడియోని పరిశీలించగా, పురోహితుడు పుస్తెల తాడుని తస్కరించడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి జరిపిస్తుండగా పురోహితుడు జేబులో పుస్తెలతాడు వేసుకుంటున్న దృశ్యాలను పరిశీలించారు. కాగా, పెళ్లి చేసేందుకు వచ్చిన పురోహితుడే పుస్తెలతాడును అపహరించాడనే వార్త అందరిని షాక్ కి గురి చేసింది. వార్నీ.. అని అంతా ముక్కున వేలేసుకున్నారు.