AP Cabinet Meeting : ఏపీ కేబినెట్ భేటీ.. అసెంబ్లీ సమావేశాలు, రాజధానిపై కీలక చర్చ

నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగనుంది. విశాఖ కేంద్రంగా రాజధాని అంశంతోపాటు అసెంబ్లీ సమావేశాలపై కేబినెట్ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

AP Cabinet meeting : నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగనుంది. విశాఖ కేంద్రంగా రాజధాని అంశంతోపాటు అసెంబ్లీ సమావేశాలపై కేబినెట్ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే నెల మొదటి వారంలో జరిగే ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ పై కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి నెల చివరి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం మొదట భావించింది.

అయితే మార్చి మొదటి వారంలో వైజాగ్ లో ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ జరుగనుంది. ఆ సమ్మిట్ తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. విశాఖలో జరుగనున్న ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ కు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ సమావేశాలకు సంబంధించి కొంతమంది మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.

Harirama Jogaiah Vs Amarnath : బలవంతుడిని తప్పించడానికి సాయం తీసుకోవడం తప్పుకాదు- మంత్రి అమర్నాథ్‌కు హరిరామజోగ్య మరో లేఖాస్త్రం

ఈ అంశాలతోపాటు తాజా రాజకీయ పరిణామాలు, సంక్షేమ పథకాలు, జగన్ ఢిల్లీ టూర్లపై కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. విశాఖపట్నం కేంద్రంగా రాజధాని అంశంపై సీఎం జగన్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. దీంతో రాజధాని అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సీఎం జగన్ విశాఖకు షిఫ్టింగ్ పై కేబినెట్ లో కీలకంగా చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. తెలుగు సంవత్సరాది ఉగాది తర్వాత సీఎం జగన్ వారానికి మూడు రోజులు వైజాగ్ లో ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

ట్రెండింగ్ వార్తలు