Harirama Jogaiah Vs Amarnath : బలవంతుడిని తప్పించడానికి సాయం తీసుకోవడం తప్పుకాదు- మంత్రి అమర్నాథ్‌కు హరిరామజోగ్య మరో లేఖాస్త్రం
నన్ను రెచ్చగొట్టడం ద్వారా లాభపడాలని ప్రయత్నించకు. నేను చెప్పిన దాంట్లో సత్యం ఎంతో ఆలోచించు. అధికారంలో ఉన్నప్పుడు సాధ్యపడక పోయినా చివరి దశలో నైనా కాపుల సంక్షేమం కోరి ఈ కార్యక్రమానికి తలపడ్డాను. కాపులకు రిజర్వేషన్లు కల్పించడం మొదటి లక్ష్యం అయితే బడుగు బలహీన వర్గాలకు అధికారం దక్కించాలన్నది రెండవ లక్ష్యం.

Harirama Jogaiah Vs Amarnath : కాపు ఫైట్.. ఏపీని షేక్ చేస్తోంది. కాపు సామాజిక వర్గం మద్దతు ఎవరికి అనే అంశం.. రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. మాజీమంత్రి, కాపు ఉద్యమ నేత చేగొండి హరిరామజోగయ్య, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మధ్య లేఖల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తొలుత హరిరామ జోగయ్య మంత్రి అమర్ నాథ్ కు లేఖ రాయగా.. మంత్రి గుడివాడ అమర్ నాథ్ కౌంటర్ లేఖ రాశారు. తాజాగా మరో లేఖలో అమర్ నాథ్ మాజీ మంత్రిని నిలదీశారు. టీడీపీ, జనసేన మధ్య పొత్తును ఎలా సమర్థిస్తారని వంగవీటి రంగ హత్యను ప్రస్తావిస్తూ హరిరామ జోగయ్యను ప్రశ్నించారు. నేను కూడా తగ్గేదేలే అంటున్నారు హరిరామజోగయ్య. లేఖల యుద్ధాన్ని ఆయన కంటిన్యూ చేస్తున్నారు.
మూడవ లేఖతో మంత్రి గుడివాడ అమర్నాథ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు హరిరామజోగయ్య. అనవసరంగా ఉత్తరాల మీద ఉత్తరాలు రాసి నా ఓపికను పరీక్షించకు అని హెచ్చరించారు.
Also Read..Somu Veerraju: బీజేపీ అధికారంలోకి వస్తే అమరావతిలోనే రాజధానిని నిర్మిస్తాం: సోము వీర్రాజు
”నన్ను రెచ్చగొట్టడం ద్వారా లాభపడాలని ప్రయత్నించకు. నేను చెప్పిన దాంట్లో సత్యం ఎంతో ఆలోచించు. అధికారంలో ఉన్నప్పుడు సాధ్యపడక పోయినా చివరి దశలో నైనా కాపుల సంక్షేమం కోరి ఈ కార్యక్రమానికి తలపడ్డాను. కాపులకు రిజర్వేషన్లు కల్పించడం మొదటి లక్ష్యం అయితే బడుగు బలహీన వర్గాలకు అధికారం దక్కించాలన్నది రెండవ లక్ష్యం.
అనేక సంవత్సరాలుగా రాష్ట్రంలో రెండు కులాలే అధికారం చేపడుతున్నాయి. ఈ దౌర్భాగ్య స్థితి నుండి రాష్ట్రాన్ని కాపాడాలనేదే నా ఆకాంక్ష. నాది కుల పిచ్చి కాదు. రాజ్యాధికారం దక్కుంచుకోవడానికి, బలవంతుడిని తప్పించడానికి మరొకరి సాయం తీసుకోవడం తప్పుకాదని నా దృడ సంకల్పం” అని మంత్రి అమర్నాథ్ కు రాసిన లేఖలో తేల్చి చెప్పారు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామజోగయ్య.