Harirama Jogaiah Vs Gudivada Amarnath : ఏపీని షేక్ చేస్తున్న కాపు ఫైట్.. హరిరామజోగయ్య, మంత్రి అమర్నాథ్ మధ్య లేఖల యుద్ధం

Harirama Jogaiah Vs Gudivada Amarnath: కాపు ఫైట్.. ఏపీని షేక్ చేస్తోంది. హరిరామజోగయ్య, మంత్రి అమర్నాథ్ మధ్య లేఖల యుద్ధం నడుస్తోంది. మంత్రి అమర్నాథ్ లేఖకు హరిరామజోగయ్య రిటర్న్ లెటర్ రాశారు. హరిరామజోగయ్యకు మరో లేఖ రాశారు మంత్రి అమర్నాథ్.

Harirama Jogaiah Vs Gudivada Amarnath : ఏపీని షేక్ చేస్తున్న కాపు ఫైట్.. హరిరామజోగయ్య, మంత్రి అమర్నాథ్ మధ్య లేఖల యుద్ధం

Harirama Jogaiah Vs Gudivada Amarnath : కాపు ఫైట్.. ఏపీని షేక్ చేస్తోంది. కాపు సామాజిక వర్గం మద్దతు ఎవరికి అనే అంశం.. రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. మాజీమంత్రి, కాపు ఉద్యమ నేత చేగొండి హరిరామజోగయ్య, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మధ్య లేఖల యుద్ధం కొనసాగుతూనే ఉంది.

తొలుత హరిరామ జోగయ్య మంత్రి అమర్ నాథ్ కు లేఖ రాయగా.. మంత్రి గుడివాడ అమర్ నాథ్ కౌంటర్ లేఖ రాశారు. తాజాగా మరో లేఖలో అమర్ నాథ్ మాజీ మంత్రిని నిలదీశారు. టీడీపీ, జనసేన మధ్య పొత్తును ఎలా సమర్థిస్తారని వంగవీటి రంగ హత్యను ప్రస్తావిస్తూ హరిరామ జోగయ్యను ప్రశ్నించారు.

మంత్రి అమర్ నాథ్ రాసిన రెండో లేఖలో.. వంగవీటి మోహన రంగాని చంపించింది చంద్రబాబు నాయుడేనని గతంలో హరిరామ జోగయ్య ఆరోపించిన విషయాన్ని గుర్తు చేశారు. అలాంటి చంద్రబాబుతో పొత్తులకు సిద్ధమైన పవన్ కల్యాణ్ ను సమర్థిస్తారా? అని అమర్నాథ్ అడిగారు.(Harirama Jogaiah Vs Gudivada Amarnath)

Also Read.. Somu Veerraju: బీజేపీ అధికారంలోకి వస్తే అమరావతిలోనే రాజధానిని నిర్మిస్తాం: సోము వీర్రాజు

అంతకుముందు, మాజీ మంత్రి హరిరామ జోగయ్య మంత్రి గుడివాడ అమర్ నాథ్ కు ఘాటు లేఖ రాశారు. రాజకీయాల్లో ఇంకా పైకి రావాల్సిన వ్యక్తివి అని అందులో పేర్కొన్నారు. ఓ మంత్రి పదవికి అమ్ముడుపోయి కాపుల భవిష్యత్తును పాడు చేయొద్దని హితవు పలికారు. పవన్ కల్యాణ్ పై అనవసరంగా బురదజల్లే ప్రయత్నం చేయొద్దని సూచించారు. దీనికి మంత్రి గుడివాడ అమర్ నాథ్ జవాబిస్తూ.. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కు రాయాల్సిన లేఖను పొరపాటున తనకు రాశారంటూ ఎద్దేవా చేశారు.

మంత్రి అమర్నాథ్ లేఖకు హరిరామజోగయ్య రిటర్న్ లెటర్ రాశారు. 2024లో సీఎం పదవిని కాపులకు వైసీపీ ఇస్తుందా? అని ప్రశ్నించారు హరిరామజోగయ్య. అలా చేయకుంటే కాపు సామాజికవర్గానికి చెందిన మంత్రులంతా వైసీపీకి రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. పవన్ కు సపోర్ట్ చేయకపోతే నీది కాపు పుట్టుకేనా అన్నారు హరిరామజోగయ్య.

రంగాను హత్య చేసిన చంద్రబాబుకు పవన్ కల్యాణ్ మద్దతు తెలుపుతున్నారని మంత్రి అమర్నాథ్ అన్నారు. పవన్ ను సమర్థిస్తున్నారా అని హరిరామజోగయ్యను ప్రశ్నించారు మంత్రి అమర్నాథ్. దీనికి సమాధానం చెప్పకుంటే కాపు జాతి మిమ్మల్ని హర్షించదన్నారు అమర్నాథ్.

Also Read.. CM Jagan: మార్చిలో విశాఖకు మారనున్న సీఎం జగన్.. అనువైన ఇండ్ల అన్వేషణలో నేతలు, అధికారులు

మంత్రి అమర్నాథ్ లేఖకు సమాధానమిస్తూ మరో ప్రశ్నాస్త్రాన్ని సంధించారు మాజీమంత్రి చేగొండి హరిరామ జోగయ్య. 2015లో నేను రాసి పబ్లిష్ చేసిన పుస్తకంలో రంగా హత్యకు చంద్రబాబు కారణమనే నేపథ్యం ఉంది. అయితే చివర్లో దీనిపై దేవుడికే ఎరుక అనే అంశాన్ని కూడా ప్రస్తావించాను. రంగా కొడుకు రాధాకృష్ణ ప్రస్తుతం టీడీపీతో అంటిపెట్టుకుని ఉన్నారు.

దేవినేని నెహ్రూ కొడుకు దేవినేని అవినాష్ ఇప్పుడు మీ వైసీపీ పార్టీలో ఉన్నారు. వాళ్ళిద్దరికీ లేనిది నీకు నాకు ఎందుకు. 2024 ఎన్నికల్లో మీ పార్టీ తరపున కాపు లేదా బీసీ, ఎస్సీ, మైనార్టీ నుంచి ఎవరినైనా ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెట్టే దమ్ము వైసీపీకి ఉందా? అలా కాకుంటే నువ్వు నీ సహచర కాపు మంత్రులు వైసీపీకి రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయకపోతే నీదసలు కాపు పుట్టుకేనా? అంటూ లేఖలో నిప్పులు చెరిగారు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

చేగొండి హరిరామజోగయ్యకు మరో లేఖ రాశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ”వంగవీటి రంగాను చంపిన చంద్రబాబుకు మద్దతు తెలుపుతున్న పవన్ కళ్యాణ్ ను మీరు సమర్థిస్తున్నారా? సమర్థిస్తున్నారో లేదో సమాధానం చెప్పకుండా నాపై ఆరోపణలు చేయిస్తే కాపు జాతి మిమ్మల్ని హర్షించదు. రంగాను చంపింది చంద్రబాబు అని కాపు డీఎన్ఏ ఉన్న ఎవరిని అడిగినా చెప్తారు. మీరు, పవన్ కళ్యాణ్ దానికి మినహాయింపు అయితే అది మీ ఇష్టం. మీ పుస్తకంలో ఆనాడు అబద్ధాలు, తప్పులు రాసుంటే ఆ విషయం చెప్పండి.

రంగా హత్యకు చంద్రబాబు కారణమని చెప్పిన చాలా మందిలో మీరొకరు. 2024 ఎన్నికల్లో కాపు ఓట్లను చంద్రబాబుకు అమ్మేయాలన్న పవన్ కళ్యాణ్ ఆలోచనను నేను వ్యతిరేకిస్తున్నా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ విషయం కోర్టులు సమాధానం చెబుతాయి. నేను మా నాన్న కాపులం అవునో కాదో మీ సర్టిఫికెట్ మాకు అవసరం లేదు. మేము చంద్రబాబుని ప్రశ్నిస్తే మీరు మా పుట్టుకను ప్రశ్నిస్తున్నారంటే మీ సంస్కారానికి మా నమస్కారం” అని మంత్రి అమర్నాథ్ లేఖలో పేర్కొన్నారు.