CM Jagan: మార్చిలో విశాఖకు మారనున్న సీఎం జగన్.. అనువైన ఇండ్ల అన్వేషణలో నేతలు, అధికారులు

వచ్చే ఉగాది నుంచి విశాఖ కేంద్రంగా పాలన సాగుతుందని ఏపీ మంత్రులు కూడా చెప్పారు. దీంతో రాజధానిని విశాఖకు తరలించేందుకు ఏపీ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విశాఖ జిల్లా అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. అధికారికంగా ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు.

CM Jagan: మార్చిలో విశాఖకు మారనున్న సీఎం జగన్.. అనువైన ఇండ్ల అన్వేషణలో నేతలు, అధికారులు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖపట్నం అని ఇటీవల ఢిల్లీలో సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే ఉగాది నుంచి విశాఖ కేంద్రంగా పాలన సాగుతుందని ఏపీ మంత్రులు కూడా చెప్పారు. దీంతో రాజధానిని విశాఖకు తరలించేందుకు ఏపీ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Delhi: కబడ్డీ క్రీడాకారిణిపై కోచ్ అత్యాచారం.. బాధితురాలి ఫిర్యాదు.. ఢిల్లీ కోర్టులో విచారణ

ఈ మేరకు విశాఖ జిల్లా అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. అధికారికంగా ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. అయినప్పటికీ విశాఖపట్నంలో సీఎం జగన్ ఉండబోయే ఇంటికోసం అధికారులు వెతుకుతున్నారు. ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగి పనులు ప్రారంభించారు. ముఖ్యమంత్రి నివసించబోయే అనువైన ఇంటి కోసం అధికారులు వెతుకుతున్నట్లు సమాచారం. విశాఖ బీచ్ రోడ్డులో ఇంటి కోసం ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే మంచి ఇంటిని ఎంపిక చేసే అవకాశం ఉంది. అన్నీ కుదిరితే మార్చి 22 లేదా 23 తేదీల్లో విశాఖలో ముఖ్యమంత్రి జగన్ గృహ ప్రవేశం చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.

Ponnam Prabhakar: కేసీఆర్ తీరుతో తెలంగాణకు తీరని అన్యాయం: పొన్నం ప్రభాకర్

సీఎం తన నివాసాన్ని విశాఖకు మార్చనున్న నేపథ్యంలో, ముందుగానే అధికారులు సీఎం ఉండబోయే ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. ప్రభుత్వ ప్రకటనతో మంత్రులు, ఐఏఎస్ ఉన్నతాధికారులు కూడా అప్రమత్తమయ్యారు. విశాఖలో తమకు అనువైన ఇళ్ల కోసం వెతుకుతున్నారు. తమకు తెలిసిన వారి ద్వారా మంచి ఇండ్లు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏఎంసీ అకోశా సమీపంలో అధికారుల కోసం చేపట్టిన డుప్లెక్స్ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. అధికారిక ఆదేశాలు వచ్చేలోపే విశాఖకు వెళ్లేందుకు సిద్ధగా నేతలు, అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో త్వరలోనే విశాఖ నుంచి ఏపీ పాలన సాగే అవకాశం ఉందని తెలుస్తోంది.