Somu Veerraju: బీజేపీ అధికారంలోకి వస్తే అమరావతిలోనే రాజధానిని నిర్మిస్తాం: సోము వీర్రాజు

బీజేపీ అధికారంలోకి వస్తే అమరావతిలోనే రాజధానిని నిర్మిస్తామని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ... గత ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి ఇద్దరూ రాజధానిని నిర్మించలేదని అన్నారు. మూడు రాజధానులు అని అంటున్న సీఎం జగన్ వాటికి కనీసం రూ.300 కూడా ఖర్చు చేయలేదని సోము వీర్రాజు విమర్శించారు.

Somu Veerraju: బీజేపీ అధికారంలోకి వస్తే అమరావతిలోనే రాజధానిని నిర్మిస్తాం: సోము వీర్రాజు

Somu Veerraju: బీజేపీ అధికారంలోకి వస్తే అమరావతిలోనే రాజధానిని నిర్మిస్తామని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ… గత ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి ఇద్దరూ రాజధానిని నిర్మించలేదని అన్నారు. మూడు రాజధానులు అని అంటున్న సీఎం జగన్ వాటికి కనీసం రూ.300 కూడా ఖర్చు చేయలేదని సోము వీర్రాజు విమర్శించారు.

కేవలం ఎడ్యుకేషన్ లోనే 10 రత్నాలను బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. 60 సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందిస్తోందని తెలిపారు. జగన్ కంటే మోదీ అందిస్తున్న సంక్షేమ పథకాలే రాష్ట్రంలో అధికమని చెప్పారు. 2024 అధికారం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. పత్తికొండ ప్రాంతంలో రాఘవేంద్ర స్వామి మఠానికి చెందిన 29 ఎకరాలను నాయకులు కబ్జా చేశారని చెప్పారు.

వైసీపీలోని ఎమ్మెల్యేలు.. పరిపాలకులుగా కాకుండా కేవలం ట్రేడర్స్ గా వ్యవహరిస్తున్నారని సోము వీర్రాజు విమర్శించారు. రాష్ట్రంలో కుటుంబ రాజకీయ పరిపాలన కొనసాగుతోందని అన్నారు. కుటుంబ పరిపాలనకు బీజేపీ దూరమని చెప్పారు. రాష్ట్రానికి ప్రాజెక్టు ల నిర్మాణానికి కేంద్రం గత నాలుగు సంవత్సరాలుగా 16 వేల కోట్ల రూపాయలు ఇచ్చిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడం దురదృష్టకరమని అన్నారు. 2024లో బీజేపీ అధికారంలోకి వస్తే రాయలసీమ ఆభవృధ్ధి కోసం రూ.5,000 కోట్లు కేటాయిస్తామని చెప్పారు.

Andhra Pradesh Govt Debts : ఏపీ అప్పుల చిట్టాను మరోసారి బయటపెట్టిన కేంద్రం.. ఎన్ని లక్షల కోట్లో తెలుసా..?!