Andhra Pradesh Govt Debts : ఏపీ అప్పుల చిట్టాను మరోసారి బయటపెట్టిన కేంద్రం.. ఎన్ని లక్షల కోట్లో తెలుసా..?!

ఏపీ అప్పుల చిట్టాను కేంద్ర ప్రభుత్వం మరోసారి బయటపెట్టింది. ఏపీని అప్పుల ఆంధ్రాగా మారుస్తున్నారని ఏపీ ప్రతీ సంవత్సరం సుమారు రే.45 కోట్ల వేల అప్పులు చేస్తోందని వెల్లడించింది కేంద్ర ఆర్థిక శాఖ. 2019తో పోలిస్తే ఈ అప్పులు భారీ స్థాయిలో ఉన్నాయని తెలిపింది. 2019తో పోలిస్తే ఏపీ చేస్తున్న అప్పులు దాదాపు రెండింతలు పెరిగాయని వెల్లడించింది.

Andhra Pradesh Govt Debts : ఏపీ అప్పుల చిట్టాను మరోసారి బయటపెట్టిన కేంద్రం.. ఎన్ని లక్షల కోట్లో తెలుసా..?!

Andhra Pradesh Govt Debts List

Andhra Pradesh Govt Debts List : ఏపీ అప్పుల చిట్టాను కేంద్ర ప్రభుత్వం మరోసారి బయటపెట్టింది. ఏపీని అప్పుల ఆంధ్రాగా మారుస్తున్నారని ఏపీ ప్రతీ సంవత్సరం సుమారు రే.45 కోట్ల వేల అప్పులు చేస్తోందని వెల్లడించింది కేంద్ర ఆర్థిక శాఖ. 2019తో పోలిస్తే ఈ అప్పులు భారీ స్థాయిలో ఉన్నాయని తెలిపింది. 2019తో పోలిస్తే ఏపీ చేస్తున్న అప్పులు దాదాపు రెండింతలు పెరిగాయని సుమారు రూ.లక్ష కోట్ల అప్పులు పెరిగాయని తెలిపింది.బడ్జెట్ లెక్కల ప్రకారం ప్రస్తుతం ఏపీ అప్పు రూ.4,42,442 కోట్లుగా ఉందని వెల్లడించింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల ప్రశ్నకు కేంద్రం సమాధానమిస్తూ ఏపీ అప్పుల చిట్టాను రాతపూర్వకంగా బయటపెట్టింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి టీడీపీ ఎంపీ కనకమేడలకు రాతపూర్వకంగా సమాధానమిచ్చారు.

కాగా..అప్పుల ఆంధ్రాగా మారుతున్న రాష్ట్ర పరిస్థితిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వంపై సెటైర్లు వేస్తే ట్వీట్ చేశారు. సీఎం జగన్ పై సెటైర్లు వేస్తూ..ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఒక కార్టూన్‌తో కూడిన ట్వీట్ చేస్తూ..‘‘అప్పులతో ‘ఆంధ్ర’ పేరు మారు మోగిస్తున్నందుకు ముఖ్యమంత్రికి నా ప్రత్యేక శుభాకాంక్షలు. కీప్ ఇట్ అప్! మీ సంపదను పెంచుకోవడం మాత్రం మర్చిపోకండి. రాష్ట్ర అభివృద్ధి, సంపదను కుక్కలపాలు చేయండి.

కానీ, మీ సంపద, ఆస్తుల్ని మాత్రం పెంచుకోండి. అదే ముఖ్యమంత్రి స్ఫూర్తి’’ అని పవన్ ట్వీట్ చేశారు. దీనికి ఒక కార్టూన్ కూడా జత చేశారు. అందులో సీఎంకు ‘అప్పురత్న’ అవార్డు ఇస్తున్నట్లుగా ఉంది. ఈ కార్టూన్‌లోనే తొమ్మిది నెలల్లో ఏపీ రూ.55,555 కోట్లు అప్పు చేసినట్లు పేర్కొన్నారు అని ట్వీట్ చేశారు. ఇది వైసీపీ సర్కారు రికార్డుగా అంటూ పవన్ సెటర్ వేశారు.