Ap Cabinet Meeting Updates: ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలు.. వీటికి ఆమోదముద్ర

సీఆర్‌డీఏ 44వ సమావేశంలో తీసుకున్న రెండు పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

AP Cabinet

Today Ap Cabinet Meeting Updates: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన ఇవాళ క్యాబినెట్ సమావేశం జరిగింది. ఇందులో కీలక నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 14 అంశాల ఎజెండాలకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. అమరావతిలో రూ.2,733 కోట్ల పనులకు ఆమోదముద్ర పడింది.

చిత్తూరు జిల్లాలో హోంశాఖ ఐఆర్‌ బెటాలియన్‌ ఏర్పాటుకు కేటాయించాల్సిన స్థలంపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. క్లీన్ఎన‌ర్జీలో పెట్టుబ‌డులపై చర్చించారు. విశాఖలో టీసీఎస్ ఏర్పాటుపై చర్చించినట్లు తెలుస్తోంది. జనవరి 8న వైజాగ్ కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రానున్నారు.

ప్రధాని రాష్ట్ర పర్యటనపై క్యాబినెట్ లో చర్చ జరిగింది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపనలు చేయాల్సిన అంశాలపై కూడా చర్చ జరిగింది. ప్రధాని పర్యటనకు భారీగా ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో పలు పరిశ్రమలకు భూ కేటాయింపులు చేస్తూ ఆమోదం తెలిపింది క్యాబినెట్.

గోదావరి – బనక చర్ల ప్రాజెక్టుపై మంత్రివర్గానికి సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమయంలో ఈ ప్రాజెక్టు ను ప్రారంభించకపోతే నిర్మాణ అంచనా వ్యయం ఏడాదికి 40 వేల కోట్లు పెరుగుతుందని తెలిపారు. కేంద్రాన్ని మెప్పించి, ఒప్పించేందుకు సలహాలు ఇవ్వాలని కోరారు.

 

 

క్యాబినెట్‌ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..

  • సీఆర్‌డీఏ 44వ సమావేశంలో తీసుకున్న రెండు పనులకు మంత్రివర్గం ఆమోదం
  • మున్సిపల్‌ చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు గ్రీన్‌ సిగ్నల్‌
  • భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల జారీ అధికారం మున్సిపాలిటీలకు బదలాయించేలా చట్ట సవరణకు ఆమోదం
  • పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు పచ్చజెండా
  • నంద్యాలతో పాటు వైఎస్సార్‌, కర్నూలు జిల్లాల్లో పవన, సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు అంగీకారం
  • రైతులకు కేంద్రం ఇస్తున్న 10 వేలతో పాటు రాష్ట్ర కూడా అదే సమయంలో మరో 10 వేలు ఇవ్వాలని నిర్ణయం
  • మత్స్యకారులకు ఫిషింగ్ హాలిడే సమయంలో రూ.20 వేలు ఇవ్వాలని నిర్ణయం

బంగ్లాదేశ్‌లో చిన్మయ్‌ కృష్ణదాస్‌ బెయిల్ పిటిషన్‌ తిరస్కరణ