Chandrababu Naidu: వితంతు రుద్రమ్మకు ఇంటి వద్దే పింఛను అందించిన సీఎం చంద్రబాబు

గ్రామ ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించి ఇందిరమ్మ కాలనీలో పింఛన్ల పంపిణీ చేస్తున్నారు.

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజక వర్గం బొమ్మనహల్ మండలం నేమకల్లు గ్రామంలోని ప్రసిద్ధి గాంచిన శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు సీఎం చంద్రబాబు.

అనంతరం అంజనేయ స్వామి ఆలయం ఎదురుగా ఏర్పాటు చేసిన ప్రజావేదిక (పేదల సేవలో..) కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలను అడిగి వారి సమస్యలను తెలుసుకున్నారు.

రేపు (ఆదివారం) సెలవు కావడంతో ఒక రోజు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు పంపిణీ చేస్తోంది. సీఎం చంద్రబాబు అనంతపురంలోని నేమకల్లులో లబ్ధిదారులకు నగదు పంపిణీ చేశారు. గ్రామ ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించి ఇందిరమ్మ కాలనీలో పింఛన్ల పంపిణీ చేస్తున్నారు.

వితంతు రుద్రమ్మకు ఇంటి వద్దే చంద్రబాబు పింఛను అందించారు. అలాగే, నేమకల్లులో దివ్యాంగురాలు భాగ్యమ్మ ఇంటికెళ్లారు. భాగ్యమ్మ కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

అదానీని ప్రతి భారతీయుడి కంటే భిన్నంగా చూడనున్నామని ప్రధాని మోదీ చెబుతున్నారు: రాహుల్ కామెంట్స్‌