అదానీని ప్రతి భారతీయుడి కంటే భిన్నంగా చూడనున్నామని ప్రధాని మోదీ చెబుతున్నారు: రాహుల్ కామెంట్స్
అదానీపై అమెరికాలో నేరారోపణ వచ్చినా, ఆ దేశంలో ఆయనను నేరస్తుడని అన్నప్పటికీ ఫర్వాలేదని ప్రధాని మోదీ అంటున్నారని రాహుల్ చెప్పారు.

బీజేపీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆయన కేరళలోని వయనాడ్‌లో మాట్లాడుతూ.. బీజేపీకి, తమకు మధ్య ఉన్న వ్యత్యాసాల గురించి వివరించారు.
“లోక్‌సభలో మేము ఓ రాజకీయ సిద్ధాంతంపై పోరాడుతున్నాం. ప్రేమను వ్యాప్తి చేయడం గురించి మాట్లాడుతున్నాము. వారు మాత్రం ద్వేషం, విభజన, హింస గురించి మాట్లాడుతున్నారు. ప్రజలందరినీ సమానంగా చూడాలని రాజ్యాంగం చెబుతోంది.
అదానీని ప్రతి భారతీయుడి కంటే భిన్నంగా చూడనున్నామని ప్రధాని మోదీ చెబుతున్నారు. అదానీపై అమెరికాలో నేరారోపణ వచ్చినా, ఆ దేశంలో ఆయనను నేరస్తుడని అన్నప్పటికీ ఫర్వాలేదని ప్రధాని మోదీ అంటున్నారు.
భారతదేశంలో మాత్రం తాము అదానీపై నేరారోపణ చేయమని మోదీ చెబుతున్నారు. వారి వద్ద మీడియా ఉంది. డబ్బు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, సీబీఐ, ఈడీ, ఐటీ ఇలా ఏవీ మా దగ్గర లేవు. మా వద్ద ప్రజల గురించిన ఆలోచనలు మాత్రమే ఉన్నాయి. అదే ప్రతిసారీ గెలుస్తుంది. బీజేపీ సిద్ధాంతాన్ని ఓడిస్తామనే విశ్వాసం మాకు ఉంది” అని రాహుల్ గాంధీ అన్నారు.
Maharashtra: మహారాష్ట్ర ముఖ్యమంత్రి రేసులో తెరపైకి కొత్త వ్యక్తి.. అతనెవరంటే?