Maharashtra: మహారాష్ట్ర ముఖ్యమంత్రి రేసులో తెరపైకి కొత్త వ్యక్తి.. అతనెవరంటే?

ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక స్థానాల్లో గెలుపొందడంతో బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫండ్నవీస్ కే ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Maharashtra: మహారాష్ట్ర ముఖ్యమంత్రి రేసులో తెరపైకి కొత్త వ్యక్తి.. అతనెవరంటే?

Maharashtra

Updated On : November 30, 2024 / 1:42 PM IST

Maharashtra Next Chief Minister: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ఆధ్వర్యంలోని మహాయతి కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాల నాటి నుంచి కూటమి తరుపున ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఎవరు చేపడతారన్న అంశం ఆసక్తికరంగా మారింది. సీఎం పీఠం కోసం దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్ నాథ్ షిండే పోటీ పడుతున్నారు. అజిత్ పవార్ మాత్రం దేవేద్ర ఫడ్నవీస్ కు తన మద్దతు ఇచ్చారు. ఈ క్రమంలో ఇటీవల ఢిల్లీలోని బీజేపీ పెద్దలు ముగ్గురు నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో నూతన ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై స్పష్టత రాలేదు.

Also Read: Hemant Soren : జార్ఖండ్‌లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం.. నాల్గోసారి సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం..!

ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక స్థానాల్లో గెలుపొందడంతో బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫండ్నవీస్ కే ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు పలువురు బీజేపీ నేతలు మహారాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అంటూ ప్రకనలుసైతం చేశారు. మరోవైపు ఏక్‌నాథ్ షిండే కే సీఎం బాధ్యతలు అప్పగించాలని ఆయన వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాల నాటినుంచి మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. తాజాగా ముఖ్యమంత్రి రేసులో ఫడ్నవీస్, షిండే పేర్లు కాకుండా మరో వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది. బీజేపీ తరపున లోక్ సభకు ఎన్నికైన పూణే ఎంపీ, కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయక మంత్రి మురళీధర్ మోహోల్ పేరు తెరపైకి వచ్చింది. మహారాష్ట్ర తదుపరి సీఎం మురళీధర్ మోహోల్ అని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతుంది.

 

ముఖ్యమంత్రి పదవి రేసులో తన పేరు తెరపైకి రావడంపై మురళీధర్ మోహోల్ స్పందించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి రేసులో తన పేరును బీజేపీ కేంద్ర పెద్దలు పరిశీలిస్తున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ఫడ్నవీస్ సారథ్యంలో బీజేపీ ఎన్నికల్లో పోరాడిందని అన్నారు. మా పార్టీ నిర్ణయాలు సోషల్ మీడియా ద్వారా కాదు, పార్లమెంటరీ బోర్డులో ఏకాభిప్రాయంతో తీసుకోబడతాయని, ఒకసారి పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయమే తుది నిర్ణయం అని తెలిపారు. అయితే, ప్రస్తుతానికి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అసత్యమని మురళీధర్ మోహోల్ క్లారిటీ ఇచ్చారు.