Srikanth Reddy: మా ప్రభుత్వంపై బురద జల్లేందుకు చంద్రబాబు రకరకాల కుట్రలు

లక్ష్మిపార్వతిని అడ్డుపెట్టుకుని, ఎన్టీఆర్ కు ద్రోహం చేసి చంద్రబాబు... సీఎం పదవిని దక్కించుకోలేదా..అని ప్రశ్నించారు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి.

Srikanth Reddy: రాజకీయ ఎదుగుదల కోసం ఎన్టీఆర్ నే వంచించిన చంద్రబాబు… లక్ష్మిపార్వతిని అడ్డుపెట్టుకుని, ఎన్టీఆర్ కు ద్రోహం చేసి సీఎం పదవిని దక్కించుకోలేదా..అని ప్రశ్నించారు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. మంగళవారం కడప జిల్లా రాయచోటిలోని ఆర్.అండ్. బీ అతిథి గృహంలో ఛీఫ్ విఫ్ శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… టీడీపీ నేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలోనే సీనియర్ నని చెప్పుకునే చంద్రబాబు.. ఏనాడైనా నేతగా వ్యవహరించారా అంటూ మండిపడ్డారు. తమ ప్రభుత్వం పై బురద జల్లేందుకు చంద్రబాబు, టీడీపీ నేతలు రకరకాల కుట్రలు పన్నుతున్నారని.. ఇంకెన్నాళ్లీ కుట్రలు జరుగుతాయంటూ ధ్వజమెత్తారు. సంక్రాంతి పండుగ పూర్తయి 10 రోజులవుతున్నా క్యాసినో గురించి టీడీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. చంద్రబాబు హయాంలో పరిశ్రమలను ఆకర్శించేందుకు.. నైట్ లైఫ్, క్యాబరే డిస్కో కల్చర్ ను అలవాటు చేయాలని ఆనాడు చంద్రబాబే చెప్పారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు రాష్ట్రంలో.. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల తోకలు కట్ చేస్తానని చెప్పి ఇప్పుడు వారిని రెచ్చగోట్టే విధంగా చంద్రబాబు అండ్ కో వ్యాఖ్యలు చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.

Also read: AP IAS Transfers: ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలు. ఎవరెవరు ఎక్కడికంటే!

ఇక రాష్ట్రంలో పరిస్థితులు అర్ధం చేసుకుని ఉద్యోగ సంఘాలు ప్రవర్తించాలని శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై అదనపు భారమైనా.. ఉద్యోగస్తులకు ఐఆర్ ప్రకటించామని పేర్కొన్నారు. కేంద్ర విధానాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నా.. ఉద్యోగుల అభ్యర్థన మేరకు పునరాలోచిస్తున్నట్లు వివరించారు. ఉపాద్యాయులు సైతం సీఎంను అగౌరపరిచేలా మాట్లాడటం శ్రేయస్కరం కాదని హితవు పలికారు. క్లిష్టతరమైనా పరిస్థితి ఉన్నా.. కించపరిచే వాఖ్యలు చేసినా.. ఉద్యోగుల డిమాండ్లపై చర్చించాలనే కమిటీ ఏర్పాటు చేసినట్లు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

Also read: Pakistan Woman Judge: పాక్ సుప్రీం కోర్టు తొలి మహిళా జడ్జిగా జస్టిస్ అయేషా మాలిక్

కేంద్ర మంత్రి రాష్ట్ర ప్రభుత్వంపై రెచ్చగోట్టే వాఖ్యలు చేయడం సరికాదన్న శ్రీకాంత్ రెడ్డి ఎవరినైనా రెచ్చగోట్టగలడంలో చంద్రబాబు సిద్దహస్తులంటూ ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు కొందరిని అడ్డం పెట్టుకొని కుట్రలు చేస్తే.. బీజేపీ మతవిద్వేశాలతో బలపడాలని చూస్తుందని దుయ్యబట్టారు. ప్రజలకు మేలు జరిగే విధంగా మంచి పనులకు సహాకరించేలా ప్రతిపక్షాల బుద్ధి మార్చాలని కోరుకుంటున్నట్లు శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Also read: Jai Shree Ram: భారత్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన తర్వాత “జై శ్రీరామ్” అంటున్న సౌతాఫ్రికా బౌలర్

ట్రెండింగ్ వార్తలు