Pakistan Woman Judge: పాక్ సుప్రీం కోర్టు తొలి మహిళా జడ్జిగా జస్టిస్ అయేషా మాలిక్

ఆడపిల్లలపై వివక్ష చూపుతూ, చదువుకు దూరం చేస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్న సమయంలో ఒక మహిళను దేశ అత్యున్నత న్యాయస్థానానికి జడ్జిగా నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Pakistan Woman Judge: పాక్ సుప్రీం కోర్టు తొలి మహిళా జడ్జిగా జస్టిస్ అయేషా మాలిక్

Ayesha Malik

Pakistan Woman Judge: పాకిస్తాన్ సుప్రీం కోర్టు తొలి మహిళా జడ్జిగా జస్టిస్ అయేషా మాలిక్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. పాకిస్తాన్ చరిత్రలోనే దేశ అత్యున్నత న్యాయస్థానానికి మహిళా జడ్జిగా జస్టిస్ అయేషా మాలిక్ చరిత్ర సృష్టించారు. పాకిస్తాన్ లో మతపరమైన అంశాలను ప్రజలపై రుద్దుతూ..మహిళలను ఆడపిల్లలపై వివక్ష చూపుతూ, చదువుకు దూరం చేస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్న సమయంలో ఒక మహిళను దేశ అత్యున్నత న్యాయస్థానానికి జడ్జిగా నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. లాహోర్ హైకోర్టు జడ్జి జస్టిస్ అయేషా మాలిక్‌ను సుప్రీంకోర్టు మహిళా జడ్జిగా ఆమోదిస్తూ జనవరి 21న పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఉత్తర్వులు జారీచేశారు.

Also read: Brave Children: 29 మంది బాలబాలికలకు “పీఎం బాల-పురస్కార్ అవార్డులు” అందజేత

కాగా, అయేషా మాలిక్ ను సుప్రీం జడ్జిగా నామినేట్ చేయడంపై మొదటి నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. జస్టిస్ అయేషా కంటే ముందు ముగ్గురు సీనియర్ జడ్జిలు ఉన్నారని, వారిని కాదంటూ ఆమెను సుప్రీం కోర్టుకు ఎలా నామినేట్ చేస్తారంటూ పాకిస్థాన్ బార్ కౌన్సిల్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. అదే సమయంలో జడ్జిల పదోన్నతులను పరిశీలించేందుకు ఏర్పాటైన 9 మంది సభ్యుల కమిషన్ కూడా జస్టిస్ అయేషా నామినేషన్ ను మొదట తిరస్కరించారు. అయితే.. జస్టిస్ అయేషా సమర్ధతను, సాధించిన ఘనతలను పరిగణలోకి తీసుకుని ఆమె నామినేషన్ ను కమిషన్ సభ్యులు రెండో విడతలో ఆమోదించారు.

Also read: Israel – India: భారత్ లో యూదులు ఎన్నడూ వివక్షకు గురికాలేదు: ఇజ్రాయెల్

దీంతో జస్టిస్ అయేషా మాలిక్ 2031 జూన్ వరకు పాకిస్తాన్ సుప్రీంకోర్టు జడ్జిగా కొనసాగనున్నారు. సీనియారిటీ ప్రకారం 2030 జనవరిలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా పదోన్నతి పొందే అవకాశం కూడా ఉంది. ఇక పాకిస్తాన్ సుప్రీం కోర్టుకు తొలి మహిళా జడ్జిగా నియమితులైన జస్టిస్ అయేషా మాలిక్ కు ప్రధాని ఇమ్రాన్ ఖాన్, సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ గుల్జార్ అహ్మద్, మంత్రి ఫవడ్ చౌదరి అభినందనలు తెలిపారు. మరోవైపు పాకిస్తాన్ లో మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయని, యదేశ్చగా మానవహక్కుల ఉల్లంఘన జరుగుతున్నాయనే అంశాలు వెలుగులోకి రావడంతో.. పాకిస్తాన్ కు సహాయం చేసేందుకు అంతర్జాతీయ ఆర్ధిక సంస్థలు, ఇతర సన్నిహిత దేశాలు వెనకడుగు వేస్తున్నాయి. ఈక్రమంలో వారిని తృప్తి పరిచేందుకే పాకిస్తాన్ అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకుని ఉంటారనే వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే సుప్రీం జడ్జిగా జస్టిస్ అయేషా మాలిక్ ప్రమాణ స్వీకారాన్ని పాక్ జాతీయ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

Also read: Dangerous Traveler: విమాన చక్రాలను పట్టుకుని 11 గంటలపాటు గాల్లోనే ప్రయాణించిన వ్యక్తి