Israel – India: భారత్ లో యూదులు ఎన్నడూ వివక్షకు గురికాలేదు: ఇజ్రాయెల్

భారత్ - ఇజ్రాయెల్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పాడి 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇరు దేశాల రాయబారులు వర్చువల్ పద్దతిలో సమావేశం అయ్యారు.

Israel – India: భారత్ లో యూదులు ఎన్నడూ వివక్షకు గురికాలేదు: ఇజ్రాయెల్

India Israel

Israel – India: వేల సంవత్సరాలుగా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో యూదులు వివక్షకు గురయ్యారని..కానీ భారత్ లో మాత్రం యూదులు ఎన్నడూ “వ్యతిరేక భావవాదానికి”(Anti-Semitism) గురికాలేదని భారత్ లోని ఇజ్రాయెల్ రాయభారి నోర్ గిలోన్ అన్నారు. భారత్ – ఇజ్రాయెల్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పాడి 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇరు దేశాల రాయబారులు వర్చువల్ పద్దతిలో సమావేశం అయ్యారు. ఈసందర్భంగా భారత్ – ఇజ్రాయెల్ మధ్య ఉన్న స్నేహబంధాన్ని స్మరించుకుంటూ..”డేవిడ్ నక్షత్రం మరియు అశోక చక్ర” చిహ్నాలు కలగలిసిన ఒక లోగోను ఇరు దేశాల రాయబారులు ఆవిష్కరించారు.

Also read: Dangerous Traveler: విమాన చక్రాలను పట్టుకుని 11 గంటలపాటు గాల్లోనే ప్రయాణించిన వ్యక్తి

ఇజ్రాయెల్ రాయబారి నోర్ గిలోన్ మాట్లాడుతూ.. 2000 ఏళ్లుగా యూదులు భారత్ లో నివసిస్తున్నారని.. యూరోప్ లో ఎన్నో కష్టాలు అనుభవించిన వారు భారత్ లో మాత్రం స్వేచ్చా-సమానత్వంతో ఎంతో ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారని వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ పై భారతీయులలో ఉన్న ప్రేమాభిమాన్నాన్ని చూసి ఎంతో ఆశ్చర్యం వేస్తుందని నోర్ గిలోన్ అన్నారు. భారత్ లో వివక్ష, వర్ణం, జాతి-మత వ్యతిరేకతకు తావులేదని నోర్ గిలోన్ చెప్పుకొచ్చారు. జనవరి 29 1992లో భారత్ మరియు ఇజ్రాయెల్ దేశాలు పూర్తిస్థాయి దౌత్య సంబంధాలను ఏర్పరచుకున్నాయి. అయితే అంతకుముందే ఇజ్రాయెల్ భారత్ మధ్య అనుబంధం ఏర్పడిందని నోర్ గిలోన్ అన్నారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో 900 మంది భారతీయ సైనికులు బ్రిటిష్ ఇండియా ఆర్మీ తరుపున పోరాడి ఇజ్రాయెల్ గడ్డపై అమరులయ్యారని నోర్ గిలోన్ గుర్తుచేసుకున్నారు.

Also read: AP New Districts : ఏపీలో 26 కొత్త జిల్లాల ఏర్పాటు.. రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ..!

ఈ సమావేశంలో పాల్గొన్న ఇజ్రాయెల్‌లో భారత రాయబారి సంజీవ్ సింగ్లా మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య సంబంధాలు వాణిజ్యం మరియు ఆర్థిక సంబంధాలకు మించి నాగరికంగా పెనవేసుకున్నట్లు తెలిపారు. దేశంలో అనేక ప్రాంతాల్లో యూదులు నివసిస్తున్నారని.. వారు భారత్ లో ఎన్నడూ వివక్షకు గురైన సందర్భాలు లేవని పేర్కొన్నారు. నవనగర్‌కు చెందిన మహారాజా జామ్ సాహిబ్.. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అనేక మంది యూదు పిల్లలకు ఆశ్రయం కల్పించి, వారి సంరక్షణ బాధ్యతను చేపట్టి వారి ప్రాణాలను రక్షించారని సంజీవ్ సింగ్లా గుర్తు చేశారు.