CID Counter : చంద్రబాబు హౌస్ అరెస్ట్ పిటీషన్‌పై సీఐడీ కౌంటర్ పిటీషన్

చంద్రబాబును ఏసీబీ కోర్టులో హౌస్ అరెస్ట్ కు అనుమతించాలని కోరుతు ఆయన తరపు న్యాయవాదులు పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై సీఐడీ కూడా కౌంటర్ పిటీషన్ దాఖలు చేసింది.

CID Counter : చంద్రబాబు హౌస్ అరెస్ట్ పిటీషన్‌పై సీఐడీ కౌంటర్ పిటీషన్

Chandrababu ..CB Skill Development Case

Updated On : September 11, 2023 / 6:18 PM IST

CID Counter : స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో భారీ అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన టీడీనీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించబడిన విషయం తెలిసిందే. ఈక్రమంలో చంద్రబాబు ఏసీబీ కోర్టులో హౌస్ అరెస్ట్ కు అనుమతించాలని కోరుతు ఆయన తరపు న్యాయవాదులు పిటీషన్ దాఖలు చేశారు.దీనిపై సీఐడీ కూడా కౌంటర్ పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై కోర్టులో వాదనలు కొసాగుతున్నారు. చంద్రబాబును హౌస్ అరెస్ట్ కు అనుమతి ఇస్తే కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందని కాబట్టి హౌస్ అరెస్ట్ కు ఎట్టిపరిస్థితుల్లోను అనుమతి ఇవ్వవద్దని కోర్టును కోరింది.

Chandrababu : చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో ఏపీ ప్రభుత్వం మరో పిటిషన్

తాము అరెస్ట్ చేసిన సమయంలో చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారని..తాము ఆయన్ని ఎటువంటి ఇబ్బందులకు గురి చేయటంలేదని ఆయన బాగానే ఉన్నారని..ఈ కేసులో ఆయన్ని పలు అంశాలపై విచారించాల్సిన అసవరం ఉందని ఏసీబీ కోర్టుకు వెల్లడించింది. ఆయన పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారని కోర్టు ఆదేశాల మేరకు తాము నడుచుకుంటున్నామని చంద్రబాబుకు జైలులో అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు. సీఆర్పీసీలో హౌస్ అరెస్ట్ అనేదేలేదని తెలిపింది సీఐడీ.

చంద్రబాబుకు ఇంట్లో కంటే జైల్లోనే భద్రత ఉంటుందని..సీఆర్పీసీలో హౌస్ రిమాండ్ గురించి ఎలాంటి ప్రస్తావన లేదని సీఐడీ కోర్టుకు తెలిపింది. బెయిల్ లభించని కారణంగానే హౌస్ రిమాండ్ అంశాన్ని తెరపైకి తెచ్చారని ఏపీ సీఐడీ తన కౌంటర్ పిటీషన్ లో ఆరోపించింది. కాగా..ఏపీ సీఐడీ తరఫున అడిషనల్ అడ్వొకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు.

Nara Lokesh : సీపీఐ నారాయణకు ధన్యవాదాలు తెలిపిన నారా లోకేశ్