Chandrababu Naidu : రోడ్డుపక్కన ఆగి.. తాటి ముంజలు తిన్న చంద్రబాబు, భువనేశ్వరి.. ఫొటోలు వైరల్
Chandrababu Naidu : సీఎం చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్డుమార్గంలో వెళ్తుండగా.. రహదారి పక్కనే తాటి ముంజలు అమ్ముతున్న కల్లుగీత కార్మికుల వద్దకు వెళ్లారు. వారితో కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి తాటి ముంజలను తిన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను చంద్రబాబు ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘కల్తీ లేదు.. కార్బైడ్ లేదు.. పురుగు మందుల గోల లేదు.. మా కుప్పం ప్రజల మనసుల్లాంటి స్వచ్ఛమైన, చల్లనైన తాటిముంజలు రోడ్డు పక్కన ఆగి తింటుంటే ఎంతో హాయిగా ఉంది. మన గ్రామీణ ఆహార ఉత్పత్తులను మించింది ఏముంటుంది’ అంటూ పేర్కొన్నారు. ఆ తరువాత బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ కేంద్రంలో ఆ సంస్థ 45వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన సత్సంగ్‌లో చంద్రబాబు పాల్గొన్నారు.
- Harish Thanniru
- Published on- May 21, 2026 / 07:03 AM IST
