ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు.. రాష్ట్ర సమస్యలపై కేంద్ర మంత్రులకు వినతులు..

పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలను కేంద్ర మంత్రుల వద్ద సీఎం చంద్రబాబు ప్రస్తావించే అవకాశం ఉంది.

Cm Chandrababu Delhi Tour : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ బాట పట్టారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలవబోతున్నారు. అమిత్ షా, నిర్మలా సీతారామన్, జైశంకర్ లతో చంద్రబాబు భేటీ కానున్నారు. రేపు మధ్యాహ్నం మీడియా కాన్ క్లేవ్ లో చంద్రబాబు పాల్గొనబోతున్నారు. అనంతరం ముంబైకి వెళ్లి అక్కడ ప్రచారంలో పాల్గొంటారు.

ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అవుతారు. సాయంత్రం 6 గంటలకు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తో భేటీ అవుతారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ అపాయింట్ మెంట్ ఖరారైనట్లు తెలుస్తోంది. రాత్రి 7 గంటలకు సీఎం చంద్రబాబు అమిత్ షా ను కలిసే అవకాశం ఉంది. పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలను కేంద్ర మంత్రుల వద్ద సీఎం చంద్రబాబు ప్రస్తావించే అవకాశం ఉంది.

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ప్రధానంగా అమరావతికి సంబంధించిన నిధులపై చర్చించే అవకాశం ఉంది. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి 15వేల కోట్ల రూపాయలు ఇచ్చేందుకు బడ్జెట్ ద్వారా సుముఖత వ్యక్తం చేసింది కేంద్రం. ఆ రుణ సహకారం అంశంతో పాటు ప్రపంచ బ్యాంకు, ఏషియా డెవలప్ మెంట్ బ్యాంక్ ద్వారా అమరావతికి ఇచ్చే నిధుల అంశంపైనా ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది.

అమరావతి నిర్మాణానికి ఆర్థిక సహకారం, పెండింగ్ అంశాలను నిర్మలా సీతారామన్ వద్ద చంద్రబాబు ప్రస్తావించే అవకాశం ఉంది. ఇక, పోలవరం నిర్మాణ పనులు వేగవంతం అవుతున్న నేపథ్యంలో ఆ అంశాన్ని కూడా ప్రస్తావించే ఛాన్స్ ఉంది. పోలవరం నిర్మాణానికి నిధులు, వెనుకబడిన జిల్లాలకు నిధులు విడుదల చేయాల్సిందిగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను చంద్రబాబు కోరే అవకాశం ఉంది.

ఇక జైశంకర్ ను కలిసి విదేశాంగపరంగా ఉన్న అంశాలు, పెట్టుబడులు, ఇతర అంశాలకు సంబంధించి చంద్రబాబు డిస్కస్ చేసే అవకాశం ఉంది. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. ఇక రేపు మధ్యాహ్నం జరిగే లీడర్ షిప్ సమ్మిట్ లో చంద్రబాబు పాల్గొనబోతున్నారు.

Also Read : ఇవాళ అసెంబ్లీకి రాలేని పరిస్థితి వచ్చింది, ఇది దేవుడి స్క్రిప్ట్- జగన్‌పై సీఎం చంద్రబాబు ఫైర్