అది రాజకీయ పార్టీ కాదు నేరస్తుల అడ్డా- వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

అధికారం వస్తే కొన్ని ఆలోచనలు వస్తాయి. బ్యాలెన్స్ చేసుకోవాలి. తాత్కాలిక ప్రలోభాలకు లొంగొద్దు.

Cm Chandrababu Naidu (Photo Credit : Facebook)

Cm Chandrababu Naidu : శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అయ్యారు. క్యాడర్ కి దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. మీ అందరి సహకారంతో ముఖ్యమంత్రిని అయ్యా అని కార్యకర్తలతో అన్నారు. చరిత్రలో హైయస్ట్ స్ట్రైకింగ్ రేటు కొట్టామని చెప్పారు. ఇచ్ఛాపురం నుండి గుంటూరు వరకు రెండే ఓడిపోయామన్నారు. ఇది ఓ చరిత్ర అని చెప్పారు. ఈ చరిత్ర వెనుక కార్యకర్తల త్యాగాలు ఉన్నాయని చంద్రబాబు అన్నారు.

”ఎప్పుడూ రానంత విజయం వచ్చిందంటే.. ప్రజలు ఎంత ఫ్రస్టేషన్ లో ఉన్నారో తెలుస్తుంది. మీకంటే 10 రెట్లు ఎక్కువ ఆశతో ప్రజలు ఉన్నారు. నా దగ్గర మంత్ర దండం ఉందనుకుంటున్నారు. ఎప్పుడూ ఇంత కష్టం అనిపించలేదు. వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం అయిపోయాయి. ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేశారు. హాస్పిటల్, రెవెన్యూ కార్యాలయాలన్నీ తాకట్టు పెట్టారు. నేను ఏ జిల్లాకు వచ్చినా కార్యకర్తలను కలవకుండా పోను. భుజాలు అరిగేలా మోశారు. కొందరు పార్టీకి పని చేశారు. కొందరు చేయలేదు.

పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అందరూ సహకరించారు. మీ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రజలకు మంచి చేసినంత వరకు మనకి ఓటమి ఉండదు. 95 CBN ని చూస్తారని చెప్పా.. మనస్సాక్షిగా పనిచేస్తా. కార్యకర్తలకు అండగా ఉంటా. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే పోరాడాం. మొన్న ఎన్నికల్లో మొత్తం రీ ఇంజనీరింగ్ చేశా. మొన్న అందరినీ నేనే ఎన్నిక చేశా. రాబోయే 30ఏళ్ల కోసం చేశా. యువతకి టిక్కెట్లు ఇచ్చా. 70మంది కొత్త ఎమ్మెల్యేలు వచ్చారు.

కొండపల్లి శ్రీనివాస్ ని వారి బాబాయ్ ని కాదని తీసుకొచ్చా. కలిశెట్టి అప్పలనాయుడుకు విజయనగరం ఎంపీ టిక్కెట్ ఇస్తే ఎవరతను అన్నారు. జెండా మోసిన కార్యకర్త అని చెప్పా. గెలిచిన యువ నేతలంతా జాగ్రత్తగా ఉండాలి. కార్యకర్తలను గౌరవించండి. సామాజిక న్యాయం చేస్తా. 50శాతం బీసీలకు సీట్లు ఇచ్చాం. జనాభా దామాషా ప్రకారం ఆర్థికంగా సామాజికంగా గౌరవం ఇచ్చే విధంగా వర్కౌట్ చేస్తున్నాం. త్వరలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తా. ప్రతీ ప్లేస్ లో రైట్ పర్సన్ ని పెడతా.

ఎమ్మెల్యేలు నాయకులను గుర్తించాలి. మీతో తిరిగే వారిని కాదు పార్టీతో తిరిగే నాయకులను గుర్తించండి. 2029కి ఇప్పటి నుండే సిద్ధమవ్వండి. పార్టీ జెండా మోసే వారిని పార్టీ ఎప్పుడూ మరిచిపోదు. దానికి కింజరాపు ఎర్రన్నాయుడు కుటుంబమే ఉదాహరణ. కేంద్రంలో ఏ రీజనల్ పార్టీకి దక్కని గౌరవం మనకి దక్కింది. అధికారం వస్తే కొన్ని ఆలోచనలు వస్తాయి. బ్యాలెన్స్ చేసుకోవాలి. తాత్కాలిక ప్రలోభాలకు లొంగొద్దు. 7 లక్షల 70 వేల మెంబర్ షిప్ అయ్యింది. మిత్రధర్మం పాటించాలి. జనసేన, బీజేపీని కలుపుకుపోవాలి. మన కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి. అలాంటి వాటిని కంట్రోల్ చేసుకోవాలి.

విభిన్న వ్యక్తులు ఉంటారు. తప్పుని కరెక్ట్ చేసుకోవాలి. కలిసి రాజకీయం చేయాలి. కలిసి ఉండాలి. ప్రత్యర్థి వైసీపీ పార్టీ రాజకీయ పార్టీ కాదు. నేరస్తుల అడ్డా. జేబులు కొట్టే వారు ఆ పార్టీలో చేరారు. నేరస్తులు రాజకీయ ముసుగులో ఉన్నారు. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తారు. కక్ష రాజకీయాలు చేయను. తప్పు చేసిన వారిని వదిలిపెట్టను” అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.

Also Read : 11 సీట్లే వచ్చినా నోరు లేస్తోంది, మీ సంగతి చూస్తా- వైసీపీ నేతలకు పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్..