CM Chandrababu Naidu
Chandrababu Naidu: ఎన్నికల సమయానికి రాష్ట్రం వెంటిలేటర్ పై ఉంది.. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఆ స్థితి నుంచి బయటపడ్డామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడ సమీపంలోని కొండపావులూరులో నిర్వహించిన ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో అమిత్ షాతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఏ విపత్తు వచ్చినా మొదట గుర్తుకొచ్చేది ఎన్డీఆర్ఎఫ్ అని అన్నారు. కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడారు. ఇతర దేశాల్లో కూడా సేవలు అందించారు. సాహసోపేతంగా సేవలు అందించారని చంద్రబాబు కొనియాడారు.
Also Read: Amit Shah: చంద్రబాబు వెనుక మోదీ కొండలా అండగా ఉన్నారు : అమిత్ షా
నేను అనేక మంది హోం, డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రులను చూశాను.. టెర్రరిస్టు, నక్సలైట్ సమస్యలను, అన్నిరకాల సమస్యలను అమిత్ షా సమర్ధవంతంగా పరిష్కరిస్తున్నారు. అమిత్ షా యంత్రంలా పనిచేస్తుంటే నాకు అసూయ కలుగుతోందని చంద్రబాబు అభినందించారు. 2047లో వికసిత్ భారత్ కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పనిచేస్తున్నారు. రాబోయే కాలంలో మన దేశం నెంబర్ వన్ స్థానంలో నిలుస్తుందని చంద్రబాబు అన్నారు. ఏపీలో 93శాతం స్ట్రైక్ రేట్ తో కూటమి అధికారంలోకి వచ్చింది. ఏపీ అవుటాఫ్ వెంటిలేటర్ గా ఉన్న రాష్ట్రం. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులు పూర్తికావాలి. నదుల అనుసంధానం చేయాలని కేంద్రం సహకారం ఇంకా ఎంతో కావాలని చంద్రబాబు కోరారు. విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ పూర్తిగా నిర్వీర్యం చేస్తే కేంద్ర ప్రభుత్వం ప్రాణం పోసింది. విశాఖపట్టణం ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది సెంటిమెంట్. ఏపీలో రూఫ్ టాప్ సోలార్ ఉత్పత్తి చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు.
పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఎన్డీఆర్ఎఫ్ 1,50,700 ప్రజల ప్రాణాలు కాపాడారు. 7,460 మంది మృతదేహాలు వారి కుటుంబ సభ్యులకు చివరి చూపునకు అందించారని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు నుంచి కాపాడుకోవడంలో
జపాన్, నెదర్లాండ్ లో ఎన్డీఆర్ఎఫ్ అందించిన సేవలు అత్యుత్తమమైనవి అని పవన్ కల్యాణ్ అభినందించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఒక ఛాలెంజ్ అన్నారు. చంద్రబాబు రాష్ట్రంలో ఎన్డీఆర్ఎఫ్ కోసం భూమి ఇచ్చారు. మానవులు చేసిన విపత్తులూఉంటాయి. గత ప్రభుత్వం చేసిన విపత్తులు ఉన్నాయి. రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన విపత్తుల నుండి కూటమి ప్రభుత్వం కాపాడిందని పవన్ పేర్కొన్నారు.