Amit Shah: చంద్రబాబు వెనుక మోదీ కొండలా అండగా ఉన్నారు : అమిత్ షా

ఏపీ అభివృద్ధిలో అహర్నిశలు కృషిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెనక ప్రధాని నరేంద్ర మోదీ కొండలాగా అండగా ఉన్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు.

Amit Shah: చంద్రబాబు వెనుక మోదీ కొండలా అండగా ఉన్నారు : అమిత్ షా

Amit Shah

Updated On : January 19, 2025 / 3:06 PM IST

Amit Shah: ఏపీ అభివృద్ధిలో అహర్నిశలు కృషిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెనక ప్రధాని నరేంద్ర మోదీ కొండలాగా అండగా ఉన్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. విజయవాడ సమీపంలోని కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ కార్యాలయం కొత్త క్యాంపస్, ఎన్ఐడీఎం సౌత్ క్యాంపస్ ను అమిత్ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈరోజు మనం ఎన్డీఆర్ఎఫ్ 20వ వార్షికోత్సవం నిర్వహించుకుంటున్నాం.. ఎన్ఐడీఎం ప్రారంభించుకున్నాం. ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ ప్రారంభించుకున్నామని అన్నారు. ప్రకృతి వల్ల వచ్చిన ప్రమాదాల నుండి ఎన్డీఆర్ఎఫ్ కాపాడుతుందని తెలిపారు.

Also Read: Pawan Kalyan: పవన్ క్యాంప్ ఆఫీస్ పై డ్రోన్ చక్కర్లు.. అసలేం జరుగుతోంది?

ఏపీ అభివృద్ధి గురించి అమిత్ షా మాట్లాడుతూ.. గతంలో మీరు కోల్పోయిన వాటిని చంద్రబాబు, మోదీ జోడీ మూడింతలు అభివృద్ధి సాధిస్తుంది. చంద్రబాబు నాయుడు రేయింబవళ్లు రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నారు. మూడు లక్షల కోట్ల అభివృద్ధికి సాయం అందించడం జరిగింది. ఆంధ్రుల ఆత్మగౌరవం అయిన విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ ను ముందుకు తీసుకెళ్లడం ముఖ్యం. అమరావతి రాజధాని ప్రాజెక్టు గత ప్రభుత్వం అటకెక్కించింది. విశాఖ పట్టణం రైల్వే జోన్ ముందుకు తీసుకొచ్చాం. 2028 నాటికి పోలవరం ద్వారా నీరు అందుతుందని వాగ్దానం చేస్తున్నానని అమిత్ షా పేర్కొన్నారు. ఎయిమ్స్ హాస్పిటల్ నిర్మించాం. విశాఖ పట్టణంలో గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీకోసం రెండు లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నామని అమిత్ షా అన్నారు. ఏపీ అభివృద్ధిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెనుక ప్రధాని నరేంద్ర మోదీ కొండలాగా అండగా ఉన్నారని అమిత్ షా తెలిపారు.

 

ఒకచోట వైపరీత్యాలు వాటిల్లినప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు ఒకే చోట వుండి సమన్వయంతో పనిచేసుకోవాలి. పనిచేసే లక్ష్యం, సమన్వయంతో పని చేయాలని నరేంద్ర మోడీ ఎప్పుడూ చెబుతారు. ప్రమాదం వాటిల్లడం కంటే‌ ముందుగానే అక్కడికి వెళ్లి అండగా వుండాలని ఇప్పుడు దృష్టి కోణం మారింది. ఎంత మందిని మనం రక్షించగలం అనే దానిమీద మనం ఇప్పుడు దృష్టి పెట్టాం. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్డీఆర్ఎఫ్ సైనికులకు అభినందనలు చెబుతున్నా.. దేశంలో ఎక్కడికి వెళ్లినా ఎన్డీఆర్ఎఫ్ వారిని చూడగానే మేము ఊపిరిపీల్చుకున్నామని చెబుతున్నారు. విదేశాలలో కూడా ఎన్డీఆర్ఎఫ్ సేవలపై ప్రశంసలు వచ్చాయని అమిత్ షా అభినందించారు.

 

నరేంద్ర మోదీ పాలనలో 14 ఫైనాన్స్ కమీషన్ లో 61వేల కోట్ల రూపాయలు ఎన్డీఆర్ఎఫ్ కు కేటాయించామని అమిత్ షా తెలిపారు. అనేక రకాల ప్రకృతి వైపరిత్యాలకు అనేక యాప్ లు తయారు చేసుకున్నాం. వాటిని క్షేత్ర స్థాయికి తీసుకెళ్లడంపై దృష్టి పెడుతున్నాం. నరేంద్ర మోదీ నేతృత్వంలో 2024లో మహారాష్ట్ర, హర్యానాలో అద్భుతమైన విజయం సాధించాం. 2025లో ఢిల్లీలోనూ ఎన్డీయే ప్రభుత్వం విజయం సాధిస్తుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.