Cm Chandrababu: పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు సినిమా సూపర్ హిట్ కావాలి- సీఎం చంద్రబాబు

ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూనే... సమయాన్ని సర్దుబాటు చేసుకుని నటించిన ఈ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.

Cm Chandrababu: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా సూపర్ హిట్ కావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్టు పెట్టారు. పవన్ కల్యాణ్ అభిమానులు, ప్రేక్షకులు ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న HariHaraVeeraMallu చిత్రం విడుదల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు చంద్రబాబు. మిత్రుడు పవన్ కల్యాణ్ చరిత్రాత్మక కథాంశంతో రూపొందించిన చిత్రంలో తొలిసారి నటించిన ‘హరిహర వీరమల్లు’ సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా అని అన్నారు.

ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూనే… సమయాన్ని సర్దుబాటు చేసుకుని నటించిన ఈ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.

హరిహర వీరమల్లు సినిమా సూపర్ హిట్ కావాలని ఆకాంక్షిస్తూ సీఎం చంద్రబాబు పెట్టిన పోస్టుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్స్ లో స్పందించారు. చిత్ర విజయాన్ని ఆకాంక్షించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు పవన్ కల్యాణ్. ఆ మేరకు ఆయన ఎక్స్ లో పోస్టు పెట్టారు. గత పదేళ్లలో పలుమార్లు చంద్రబాబుతో సమావేశమైనా ఎప్పుడూ సినిమాల ప్రస్తావన రాలేదన్నారు.

ఈ రోజు ‘హరిహర వీరమల్లు’ గురించి చంద్రబాబు ఆప్యాయంగా అందించిన ఆకాంక్ష తనకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించిందన్నారు పవన్ కల్యాణ్. చంద్రబాబు మాటలు విజయ సంకేతాలు అని అన్నారు. నా బాధ్యతలు నిర్వర్తిస్తూనే సినిమాలో నటించే వెసులుబాటు ఇచ్చినందుకు, చిత్ర విజయాన్ని ఆకాంక్షించినందుకు మనస్పూర్తిగా చంద్రబాబుకి ధన్యవాదాలు తెలియచేశారు.

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు సినిమా హంగామా స్టార్ట్ అయిపోయింది. పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక రిలీజ్ అవుతున్న ఫస్ట్ సినిమా కావడం, రెండేళ్ల తర్వాత పవన్ సినిమా వస్తుండటం.. హరిహర వీరమల్లుకు మరింత క్రేజ్ పెంచింది. ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటించారు. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి ఏఎం రత్నం నిర్మాత. జ్యోతి క్రిష్ణ డైరెక్ట్ చేశారు. ముందుగా ఈ సినిమాని డైరెక్టర్ క్రిష్ కొంత భాగం డైరెక్ట్ చేశారు. డేట్స్ కుదరకపోవడంతో డైరెక్టర్ మారారు.

Also Read: నేను సపోర్ట్ చేసిన వాళ్ళే నా సినిమాలకు ఫైనాన్స్ ఇవ్వలేదు.. నాకు కథలు చెప్పడానికి రాలేదు..

ఈ సినిమా కథ కూడా చాలా ఇంట్రస్టింగ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. పీరియాడికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. మొఘలుల కాలంలో కోహినూర్ వజ్రం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తమ అభిమాన నటుడు ఓ వీరోచిత పాత్రలో కనిపిస్తుండటం పవన్ ఫ్యాన్స్ లో మరింత క్రేజ్ పెంచింది. దాదాపు ఐదేళ్లుగా ఫ్యాన్స్ ఎదురుచూసిన సినిమా హరిహర వీరమల్లు. తెలుగు రాష్ట్రాల్లో రాత్రి 9.30 గంటలకు ప్రీమియర్ షోలు పడ్డాయి.