Pawan Kalyan : నేను సపోర్ట్ చేసిన వాళ్ళే నా సినిమాలకు ఫైనాన్స్ ఇవ్వలేదు.. నాకు కథలు చెప్పడానికి రాలేదు..

ఈ క్రమంలో తాను రాజకీయాల్లోకి వచ్చాక పరిస్థితులు ఎలా మారాయో చెప్పారు.

Pawan Kalyan : నేను సపోర్ట్ చేసిన వాళ్ళే నా సినిమాలకు ఫైనాన్స్ ఇవ్వలేదు.. నాకు కథలు చెప్పడానికి రాలేదు..

Pawan Kalyan

Updated On : July 23, 2025 / 2:30 PM IST

Pawan Kalyan : హరిహర వీరమల్లు ప్రమోషన్స్ లో భాగంగా పవన్ నేడు నేషనల్ మీడియాతో మాట్లాడి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో తాను రాజకీయాల్లోకి వచ్చాక పరిస్థితులు ఎలా మారాయో చెప్పారు.

Also Read : Pawan Kalyan : ఇజ్రాయిల్ లో నా మీద అటాక్ జరుగుతుందేమో అనుకున్నా.. నేను పాన్ ఇండియా యాక్టర్ కాదు అంటున్న పవన్..

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మొదట్లో సినిమాలు చేద్దామనే అనుకున్నాను. కానీ రాజకీయాల్లోకి వచ్చాక నాకు కథలు చెప్పడానికి ఎవరూ రాలేదు. రాజకీయాల్లో ఉన్నాడు, ఇతన్ని నమ్మి సినిమా తీయలేము అనుకున్నారు. నేను సపోర్ట్ చేసిన ఫైనాన్షియర్స్ కూడా నేను రాజకీయాల్లోకి వచ్చాను అని నా సినిమాలకు ఫైనాన్స్ కూడా ఇవ్వలేదు అని తెలిపారు పవన్.