AP Spurious Liquor: కల్తీ లిక్కర్ మాఫియాపై సీఎం చంద్రబాబు సీరియస్.. ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం..

రాజకీయ కుట్రతో కల్తీ లిక్కర్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

AP Spurious Liquor: కల్తీ లిక్కర్ మాఫియాపై సీఎం చంద్రబాబు సీరియస్.. ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం..

CM Chandrababu Naidu

Updated On : October 8, 2025 / 9:57 PM IST

AP Spurious Liquor: కల్తీ లిక్కర్ పై ఉక్కుపాదం మోపుతామన్నారు సీఎం చంద్రబాబు. ఏపీలో కల్తీ లిక్కర్ తయారీ హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కల్తీ లిక్కర్ తయారీ ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. కల్తీ మద్యం ప్రచారంతో ప్రజల్లో ఆందోళన నెలకొందని, కల్తీ మద్యం తాగించి మరణించారు అనే తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. దీనిపై విచారణ జరిపి, వాస్తవాలు బయటపెట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. రాజకీయ కుట్రతో కల్తీ లిక్కర్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

కాగా, ఏపీలో లిక్కర్ మాఫియా నడుస్తోందని వైసీపీ అధినేత జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. కల్తీ లిక్కర్ కోసమే ప్రభుత్వ మద్యం దుకాణాలను మూసివేశారని జగన్ ఆరోపించారు. ఇప్పుడు సీఎం మనుషులకే ప్రైవేట్ దుకాణాలను అప్పగించారని ధ్వజమెత్తారు. క్వాలిటీ లేని లిక్కర్ తయారు చేసి ప్రైవేట్ మాఫియా నెట్ వర్క్ ద్వారా సప్లయ్ చేస్తున్నారని జగన్ అన్నారు. ఈ మాఫియాకు పోలీసులు రక్షణగా ఉంటున్నారని ఆరోపించారు.

దోచుకో, పంచుకో, తినుకో అన్నది కూటమి పాలనలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు జగన్. చంద్రబాబు పాలనలో ఏది చూసినా దోపిడీయే అన్నారు. ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు కనిపిస్తున్నాయన్నారు. ఎక్కడ పడితే అక్కడ తమకు సంబంధించిన వారికి అర్ధ రూపాయికి, పావలాకి, రూపాయికి భూములు పంచి పెడుతున్నారు అని ధ్వజమెత్తారు.

Also Read: సింహాద్రి అప్పన్న ఆలయంలో నగలు స్వాహా..! 47 ఆభరణాల లెక్కల్లో వ్యత్యాసం..