AP CM Chandrababu
AP CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈరోజు (శనివారం) శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొనున్నారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.
సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎచ్చెర్ల నియోజకవర్గం బుడగట్లపాలెంలో రూ. 258 కోట్లు వేట నిషేధ సమయంలో మత్స్యకార చేయూత భృతిని మత్స్యకార సేవలో పథకం కింద అందించనున్నారు.
ఈ పథకం కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి 10.35గంటలకు విమానాశ్రమానికి చేరుకుంటారు. ఉదయం 10.40కి విమానాశ్రయంలో బయలుదేరి 11.20కి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
ఉదయం 11.35 గంటలకు విశాఖ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 11.55 బుడగట్లపాలెం చేరుకుంటారు. ఉదయం 11.55 నుంచి మధ్యాహ్నం 12.05 వరకు హెలిప్యాడ్ వద్ద అధికారులు ప్రజాప్రతినిధులు చంద్రబాబుకు స్వాగతం పలుకుతారు.
Read Also : Veeraiah Chowdary : టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో పురోగతి.. స్కూటీ స్వాధీనం..!
మధ్యాహ్నం 12 .10 గంటలకు హెలిప్యాడ్ నుంచి బయలుదేరి గ్రామంలో ఉన్న అమ్మవారి దర్శించుకుంటారు. మధ్యాహ్నం 12.20 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు గ్రామంలో మత్స్యకారులను కలిసి వారి సమస్యలను తెలుసుకుంటారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మధ్యాహ్నం 1.45 వరకు విరామం తీసుకోనున్నారు. మధ్యాహ్నం 1.50 గంటలకు బుడగట్లపాలెంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభకు చేరుకుంటారు.
మధ్యాహ్నం 1.50 నుంచి మధ్యాహ్నం 3.25 వరకు మత్స్యకార బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతారు. మధ్యాహ్నం 3.25 గంటల నుంచి సాయంత్రం 4.55 గంటలకు పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం అవుతారు.
అనంతరం బుడగట్లపాలెం నుంచి సాయంత్రం 5 గంటలకు హెలీప్యాడ్‌కు చేరుకుని అక్కడ నుంచి సాయంత్రం 5.05 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి విశాఖపట్నం విమానాశ్రమానికి చేరుకుంటారు.