Veeraiah Chowdary : టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో పురోగతి.. స్కూటీ స్వాధీనం..!
Veeraiah Chowdary : ఏపీ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసు విచారణలో పురోగతి లభించింది. స్కూటీ ఆధారంగా పోలీసులు అడ్రస్ ట్రేస్ చేశారు.

Veeraiah Chowdary
Veeraiah Chowdary : ప్రకాశం జిల్లాలో సంచలనంగా మారిన టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో కొద్దిగా పురోగతి సాధించారు పోలీసులు. వీరయ్య హత్య జరిగిన సమయంలో నిందితులు ఉపయోగించిన స్కూటీని పోలీసులు గుర్తించారు.
Read Also : Pakistani National : హైదరాబాద్ పోలీసుల అదుపులో పాకిస్తానీ యువకుడు.. యువతి కోసం నేపాల్ మీదుగా నగరానికి..!
చీమకుర్తిలోని ఆర్‌ఎస్ ఫ్యామిలీ డాబా వద్ద ఆ స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. దొరికిన స్కూటీ చాయిస్ నంబర్ ఆధారంగా పోలీసులు అడ్రస్ ట్రేస్ చేశారు. సదరు స్కూటీ వీరగందం దేవేంద్రనాద్ చౌదరి బామర్దిదిగా పోలీసులు గుర్తించారు.
వీరగందం, వీరయ్య చౌదరి మద్య పాతపగలు ఉండటంతో హత్య అనంతరం ప్రత్యర్దిపై అనుమానంతో దేవేంద్రనాద్ చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు దొరికిన స్కూటీ అడ్రస్ ఆదారంగా వీరగందం బామర్ది నుంచి కూపీలాగారు. హత్యలో పాల్గోన్న నిందితున్ని వైజాగ్ ప్రాంతంలో తలదాచుకోగా అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ముప్పవరపు సురేష్, వీరగందం దేవేంద్రనాద్ చౌదరీలకు చెందిన చేపల చెరువులు, మద్యం షాపుల విషయంలో వీరయ్య చౌదరితో తలెత్తిన వివాదమే హత్యకు దారి తీసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. వీరగందం దేవేంద్రనాద్ చౌదరీకి చెందిన రొయ్యల చెరువులపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి వీరయ్య చౌదరి నిలుపుదల చేయించారు.
దాంతో రెండుకోట్ల మేరా వీరగందంకు నష్టం వాటిల్లింది. వీరగందం దేవేంద్రనాద్ చౌదరీకి చెందిన రెండు మద్యం షాపులపై తరుచుగా పోలీసులతో దాడులు చేయించి ఆర్థికంగా దెబ్బతీసి చివరకు నాగులుప్పలపాడులోని మద్యంషాపుతో పాటు మరో షాపును తన చేతుల్లోకి తీసుకున్నాడు వీరయ్య చౌదరి.
Read Also : Apple iPhone Plan : ఆపిల్ బిగ్ ప్లాన్.. 2026 నాటికి అమెరికాలో విక్రయించే ఐఫోన్ల అసెంబ్లీ మొత్తం భారత్‌కు..!
వీరగందంతో పాటు వీరగంధానికి పెట్టుబడి దారుడుగా ఉన్న ముప్పవరపు సురేష్ కలిసి వీరయ్య చౌదరిని ప్రణాళిక ప్రకారం హత్య చేసినట్లు పోలీసుల నిర్దారనకు వచ్చినట్టు సమాచారం. దేవేంద్రనాద్ చౌదరికి ముప్పవరపు సురేష్ పెట్టుబడిదారుడుగా ఉన్నాడు. విదేశాల్లో అక్రమ గోల్డ్ వ్యాపారం నిర్వహిస్తున్న ముప్పవరపు సురేష్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు.