×
Ad

American Corner : ఏయూలో అమెరికన్ కార్నర్ ప్రారంభం

విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీలో అమెరికన్ కార్నర్ ఏర్పాటు అయింది. ఏయూలో ఏర్పాటు చేసిన అమెరికన్ కార్నర్ ను తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్ నుంచి సీఎం జగన్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు.

  • Published On : September 23, 2021 / 01:52 PM IST

Jagan (2)

CM Jagan launch American Corner : విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీలో అమెరికన్ కార్నర్ ఏర్పాటు అయింది. ఏయూలో ఏర్పాటు చేసిన అమెరికన్ కార్నర్ ను గురువారం తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్ నుంచి సీఎం జగన్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏయూలో అమెరికన్ కార్నర్ ఏర్పాటు చేయడం సంతోషకరమని తెలిపారు. ఇది విద్యార్థుల భవిష్యత్ కు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

అహ్మదాబాద్, హైదరాబాద్ తర్వాత విశాఖలో అమెరికన్ కర్నార్ ప్రారంభమైనట్లు జగన్ తెలిపారు. దేశంలో మూడో కేంద్రంగా అమెరికన్ కాన్సులేట్ సహకారంతో విశాఖలో అమెరికన్ కార్నర్ ఏర్పాటు చేశారు. యూఎస్ విద్య, ఉద్యోగ అవకాశాల విషయాల్లో సమాచారం కోసం అమెరికన్ కార్నర్ సహాయ పడనుంది.

Thirumala : శ్రీవారి దర్శనం పేరుతో భక్తులకు ఫేక్ మెసేజ్ లు..ఇద్దరు దళారులు అరెస్టు

ఈ కార్యక్రమంలో అమెరికన్ కాన్సులేట్ జనరల్ జోయల్ రీఫ్ మెన్, యూఎస్ ఎయిడ్ ఇండియా డైరెక్టర్ వీణా రెడ్డి, ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి తదితరులు పాల్గొన్నారు.