Thirumala : శ్రీవారి దర్శనం పేరుతో భక్తులకు ఫేక్ మెసేజ్ లు..ఇద్దరు దళారులు అరెస్టు

తిరుమలలో దళారులు రెచ్చిపోతున్నారు. శ్రీవారి దర్శనాల పేరుతో భక్తులకు శఠగోపం పెడుతున్నారు. ఫేక్ మెసేజ్ లతో భక్తులను మోసం చేస్తున్న ఇద్దరు దళారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Thirumala : శ్రీవారి దర్శనం పేరుతో భక్తులకు ఫేక్ మెసేజ్ లు..ఇద్దరు దళారులు అరెస్టు

Tirumala (1)

Fake messages to devotees : తిరుమలలో దళారులు రెచ్చిపోతున్నారు. శ్రీవారి దర్శనాల పేరుతో భక్తులకు శఠగోపం పెడుతున్నారు. ఫేక్ మెసేజ్ లతో భక్తులను మోసం చేస్తున్న ఇద్దరు దళారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిషోర్, నాగరాజు అనే దళారులు టీటీడీ ఛైర్మన్ ఆఫీస్ మెసేజ్ లను మార్చి భక్తుల పేర్లు పెట్టి మోసగిస్తున్నారు.

టీటీడీ చైర్మన్ ఆఫీస్ నుండి మెసేజ్ లు వచ్చినట్లుగా నమ్మించి భక్తులకు రూ.16,500లకు 11 టిక్కెట్లను దళారులు అమ్మారు. ఖర్చులేని విధానాన్ని ఎంచుకొని భక్తులను మోసం చేస్తున్నారు. ఫేక్ మెసేజులతో మోసగిస్తున్న ఈ కేటుగాళ్లు భక్తుల నుంచి అడ్వాన్స్ గా 8 వేల రూపాయలను కూడా తీసుకున్నారు. దళారులు పంపిన ఫేక్ మెసేజులు చూపి భక్తులు తిరుమల కొండకు వస్తున్నారు.

Tirumala : ఇకపై అందరికీ తిరుమల శ్రీవారి ఉచిత దర్శనం

అలిపిరి తనిఖీల కేంద్రంలో దర్శనం టిక్కెట్లు లేదా మెసేజులు చూపితేనే భక్తులను తిరుమలకు అనుమతిస్తారు. ఫేక్ మెసేజ్ లను అలిపిరి తనిఖీల కేంద్రంలో చూపించి భక్తులు తిరుమలకు వస్తున్నారు. అలా కొండపైకి చేరాక అసలు విషయం తెలుసుకుంటున్నారు. ఛైర్మన్ క్యాంపు కార్యాలయానికి వెళ్లిన భక్తులు మోసపోయామని తెలుసుకున్నారు.

భక్తుల ఫిర్యాదుతో పోలీసులు రంగం ప్రవేశం చేశారు. దర్శనం టిక్కెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్న కిశోర్, నాగరాజు అనే దళారులను తిరుమల టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.