CM Jagan Balakrishna Wishes : పరస్పరం పలకరించుకున్న సీఎం జగన్, ఎమ్మెల్యే బాలకృష్ణ

ఏపీ సీఎం జగన్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పరస్పరం పలకరించుకున్నారు. మర్యాదపూర్వకంగా ఒకరినొకరు నమస్కరించుకున్నారు.

CM Jagan Balakrishna Wishes : పరస్పరం పలకరించుకున్న సీఎం జగన్, ఎమ్మెల్యే బాలకృష్ణ

Updated On : November 16, 2022 / 5:19 PM IST

CM Jagan Balakrishna Wishes : ఏపీ సీఎం జగన్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పరస్పరం పలకరించుకున్నారు. మర్యాదపూర్వకంగా ఒకరినొకరు నమస్కరించుకున్నారు. సూపర్‌స్టార్‌ కృష్ణ పార్థివదేహానికి నివాళి అర్పించేందుకు సీఎం జగన్ విజయవాడ నుంచి హైదరాబాద్ లోని పద్మాలయ స్టూడియోస్‌కు వచ్చారు. పుష్పాంజలి ఘటించి సంతాపం ప్రకటించారు. ఆ తర్వాత కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

మహేశ్‌ను ఆలింగనం చేసుకుని ధైర్యం చెప్పారు. గల్లా జయదేవ్‌, పద్మావతి దంపతులు.. నమ్రత, గౌతమ్‌తోపాటు ఇతర కుటుంబసభ్యులనూ ఆయన పేరుపేరునా పలకరించారు. అదే సమయంలో అక్కడే ఉన్న బాలకృష్ణ, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు జగన్‌ నమస్కారం చేసి పలకరించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

భౌతికకాయానికి అంజలి ఘటించిన తర్వాత సీఎం జగన్ మహేశ్ బాబుతో పాటూ కుటుంబాన్ని ఓదార్చేందుకు వెళ్లారు. అదే సమయంలో బాలయ్య కూడా మహేష్ కుటుంబంతో పాటే ఉన్నారు. బాలకృష్ణ కాస్త వెనుక వైపు ఉండటంతో ముందు జగన్ గమనించలేదు.

ఆ తర్వాత బాలయ్యను గమనించారు. వెంటనే బాలకృష్ణ జగన్‌కు నమస్కారం చేశారు. సీఎం జగన్ ప్రతి నమస్కారం చేశారు. ఆ తర్వాత బాలయ్య వెనుక నుంచి ముందుకొచ్చి నిల్చున్నారు.

CM Jagan Balakrishna Wishes

సీఎం జగన్, ఎమ్మెల్యే బాలకృష్ణ.. ఇద్దరూ రాజకీయ ప్రత్యర్థులు. అలాంటి వాళ్లిద్దరూ అనుకోకుండా తారసపడ్డారు. ఒకరికొకరు ఎదురుపడాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకు పద్మాలయ స్టూడియో వేదికైంది. ఈ ఆసక్తికర సన్నివేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అటు జగన్ అభిమానులు, ఇటు బాలయ్య అభిమానులు వీడియోని వైరల్ చేస్తున్నారు.