CM Jagan To Attend YS Sharmila Son Engagement
CM Jagan : మేనల్లుడు వైఎస్ రాజారెడ్డి ఎంగేజ్ మెంట్ వేడుకలో పాల్గొనేందుకు ఏపీ సీఎం జగన్ రేపు(జనవరి 18) హైదరాబాద్ కు రానున్నారు. సీఎం జగన్ సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నుంచి హైదరాబాద్ బయలుదేరతారు. హైదరాబాద్ లోని గండిపేటలో ఉన్న గోల్కొండ రిసార్ట్స్ లో వైఎస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియల నిశ్చితార్థ వేడుకకు జగన్ హాజరుకానున్నారు. ఈ ఎంగేజ్ మెంట్ కు వైఎస్ఆర్ కుటుంబసభ్యులతో పాటు రాజకీయ ప్రముఖులు తరలిరానున్నారు.
రాజకీయాలకు అతీతంగా పలువురు ప్రముఖులను కొడుకు నిశ్చితార్థ వేడుకకు ఆహ్వానించారు వైఎస్ షర్మిల. నిశ్చితార్థంతో పాటు వివాహానికి కూడా రావాలని అందరినీ ఆహ్వానించారు షర్మిల. ఆ తర్వాత హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన రిసెప్షన్ ఆహ్వానాలను కూడా ఇప్పటికే షర్మిల పలువురు ప్రముఖులకు అందించారు. ఫిబ్రవరి 17న రాజారెడ్డి, అట్లూరి ప్రియల వివాహం జరగనుంది.
Also Read : కొడుకు పెళ్లి పత్రికని పవన్‌కి అందించిన వైఎస్ షర్మిల..
రేపు(జనవరి 18) షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ నిశ్చితార్థం జరగనుంది. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఎంగేజ్ మెంట్ వేడుక కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. తన కొడుకు నిశ్చితార్ధ వేడుకతో పాటు పెళ్లికి కూడా రావాలని పార్టీలకు అతీతంగా షర్మిల అందరినీ ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
ఫిబ్రవరి 17న వైఎస్ రాజారెడ్డి – అట్లూరి ప్రియల పెళ్లి జరగనుంది. నిశ్చితార్ధం, వివాహం తర్వాత హైదరాబాద్ లో జరిగే రిసెప్షన్ కు సంబంధించి ఇన్విటేషన్ కార్డులను ఇప్పటికే పలువురు ప్రముఖులకు అందజేశారు షర్మిల.