Pawan Kalyan : కొడుకు పెళ్లి పత్రికని పవన్‌కి అందించిన వైఎస్ షర్మిల..
కుమారుడి పెళ్లికి హాజరు కావాలంటూ పవన్ కళ్యాణ్ కి శుభలేఖని అందజేసిన వైఎస్ షర్మిల.

YS Sharmila invites Pawan Kalyan to her son Ys Raja Reddy Atluri Priya Wedding
Pawan Kalyan – YS Sharmila : వైఎస్ఆర్ కుటుంబంలో చాలా ఏళ్ళ తరువాత పెళ్లి సందడి కనిపించబోతుంది. వైఎస్ షర్మిల తనయుడు రాజారెడ్డి వివాహ వేడుక వచ్చే నెల జరగబోతున్న సంగతి తెలిసిందే. అట్లూరి ప్రియాతో వైఎస్ రాజారెడ్డి వివాహం ఫిబ్రవరి 17న జరగబోతుంటే, నిశ్చితార్థం వేడుక ఈనెల 18న జరగనుంది. ఇక కుమారుడి పెళ్లి పిలుపులను మొదలు పెట్టిన షర్మిల.. వరుసగా అందరికి పెళ్లి పత్రికని అందజేస్తూ వస్తున్నారు.
ఈక్రమంలోనే తన అన్నయ్య ఏపీ సీఎం జగన్‌కి, టీడీపీ అధినేత చంద్రబాబుకి కూడా కొడుకు శుభలేఖని అందజేశారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి కూడా పెళ్లి పత్రికని అందజేశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో పవన్ ని మర్యాదపూర్వకంగా కలుసుకున్న షర్మిల.. కుమారుడి రాజారెడ్డి పెళ్లికి హాజరు కావాలంటూ శుభలేఖని అందజేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also read : Tollywood : రిపబ్లిక్ డేకి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద డబ్బింగ్ సినిమాల ఫైట్..
వైఎస్ కుటుంబంలోకి కోడలిగా రాబోతున్న అట్లూరి ప్రియా బ్యాక్ గ్రౌండ్ గురించి మాట్లాడుకుంటే.. ఆమె బ్రదర్ అనిల్ స్నేహితుడు అట్లూరి శ్రీనివాస్ కుమార్తె అని సమాచారం. అమెరికాలో బ్రదర్ అనిల్ కు సంబంధించిన వ్యాపార లావాదేవీలు చూసుకోవడంతో పాటు ఓ కన్సల్టెన్సీ సంస్థని కూడా అట్లూరి శ్రీనివాస్ నడిపిస్తున్నట్లు సమాచారం. ఇక ఇద్దరి మధ్య ఉన్న స్నేహని ఇప్పుడు ఈ పెళ్లితో బంధుత్వంగా మార్చుకోబోతున్నారు.
వైఎస్ రాజారెడ్డి హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం యూఎస్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఎంఎస్ చేస్తున్న సమయంలోనే రాజారెడ్డికి ప్రియాతో పరిచయమైనట్లు సమాచారం. ఆ పరిచయం కాస్త స్నేహం, ప్రేమ అంటూ ఇప్పుడు పెళ్లి వరకు చేరినట్లు తెలుస్తుంది. ఇక అమెరికాలో చిగురించిన ఈ ప్రేమ.. రాజస్థాన్ లో పెళ్లి బంధంగా మారబోతుందని సమాచారం.