Andhra Pradesh : వైఎస్సార్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు.. సీఎం జగన్‌ చేతుల మీదుగా ప్రదానం

వైఎస్సార్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులను నేడు ఏపీ సీఎం జగన్‌ అందించనున్నారు. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చి, ఉత్తమ సేవలందించిన వారికి ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు.

Ysr Lifetime

YSR Lifetime Achievement Awards : వైఎస్సార్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులను ఇవాళ ఏపీ సీఎం జగన్‌ అందించనున్నారు. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చి, ఉత్తమ సేవలందించిన వారికి వైఎస్సార్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులను ఇవ్వనున్నారు. గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌, సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు విజయవాడ ఏ-కన్వెన్షన్‌ సెంటర్‌లో అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.

2021 సంవత్సరానికి 59 అవార్డులు ఇవ్వనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 29 వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌, 30 వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు ప్రదానం చేయనున్నారు. 9 సంస్థలకు, వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించి 11 అవార్డులు ఇవ్వనున్నారు. కళలు, సంస్కృతికి 20 అవార్డులు, సాహిత్యం-7, జర్నలిజం-6, కొవిడ్‌ సమయంలో సేవలందించిన ప్రభుత్వ వైద్య సిబ్బందికి-6 అవార్డులు ఇవ్వనున్నారు.

Maha Padayatra : నేటి నుంచి రాజధాని రైతుల మహా పాదయాత్ర

నగదు పురస్కారంతో పాటు మెమొంటో, మెడల్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందజేయనుంది. రాష్ట్రంలో తొలిసారిగా వైఎస్సార్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు, వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు ఇస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా మూడు రోజుల క్రితమే గవర్నర్‌ను కలిసి ఆహ్వానించారు సీఎం జగన్‌.

ఇవాళ ఏపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉదయం 10.15 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.