CM Jagan Delhi Tour: ఢిల్లీకి ఏపీ సీఎం జగన్.. ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులతో భేటీకానున్న సీఎం
ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు రాత్రి 7.30 గంటలకు సీఎం జగన్ ఢిల్లీకి వెళ్తారు. జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు.
- Harishth Thanniru
- Published On : March 16, 2023 / 12:14 PM IST
AP CM Jagan
CM Jagan Delhi Tour: ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు రాత్రి 7.30 గంటలకు సీఎం జగన్ ఢిల్లీకి వెళ్తారు. జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. అయితే, సీఎం జగన్ పర్యటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేంద్ర మంత్రి అమిత్ షాతో కూడా జగన్ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాని మోదీ, అమిత్ షాలతో భేటీకి సంబంధించిన టైం ఫిక్స్ అయినట్లు సమాచారం.
CM Jagan: వచ్చే జనవరి నుంచి రూ.3 వేల పెన్షన్.. నాలుగేళ్ల పాలనలో గ్రామాల రూపురేఖలు మారాయి: సీఎం జగన్
ఏపీ అసెంబ్లీలో గురువారం ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ప్రభుత్వ పథకాలకు పెద్దపీట వేస్తూ బడ్జెట్ లో కేటాయింపులు చేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజే సీఎం జగన్ ఢిల్లీకి వెళ్తుండటం ఆయన పర్యటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలతో భేటీ అయితే రాష్ట్ర సమస్యలు, పెండింగ్ బకాయిలు తదితర అంశాలపై సీఎం జగన్ వారి వద్ద ప్రస్తావించే అవకాశం ఉంది. అమిత్ షాతో పాటు మరికొందరు కేంద్ర మంత్రులనుసైతం కలిసి ఆయా శాఖలకు సంబంధించిన అంశాలపై వినతిపత్రాలనుసైతం ఇవ్వనున్నట్లు సమాచారం.
CM Jagan Delhi Tour : సీఎం జగన్ ఢిల్లీ టూర్‌పై సజ్జల క్లారిటీ..
ఏపీలో రాజధాని అంశం హాట్ టాపిక్ గా మారింది. జూలై నెలలో విశాఖ నుంచి పాలన చేస్తామని కేబినెట్ భేటీలో మంత్రులకు సీఎం జగన్ స్పష్టత ఇచ్చారు. ఈ క్రమంలో విశాఖ నుంచి జూలైలో పాలన సాగించే అంశంపై కూడా ప్రధాని, అమిత్ షాల దృష్టికి సీఎం జగన్ తీసుకెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఢిల్లీలో సీఎం జగన్ కేంద్ర మంత్రుల్లో ఎవరెవర్ని కలుస్తారు అనే అంశంపై క్లారిటీ రాలేదు.
