CM YS Jagan Review On Roads : రాష్ట్రంలో అన్నిరోడ్లు మరమ్మత్తులు చేయండి-సీఎం జగన్

రాష్ట్రంలోని రహదారుల మరమ్మత్తులు, పునరుద్దరణపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఈరోజు క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.

CM YS Jagan Review On Roads : రాష్ట్రంలోని రహదారుల మరమ్మత్తులు, పునరుద్దరణపై  ఏపీ  సీఎం వైఎస్‌ జగన్‌ ఈరోజు క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రహదారులపై   ఉన్న గుంతలు తక్షణమే పూడ్చేందుకు వెంటనే పనులు ప్రారంభించాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 46 వేల కిలోమీటర్ల రోడ్ల మరమ్మత్తులపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. ముందు పాట్‌ హోల్‌ ఫ్రీ స్టేట్‌గా రహదారులు ఉండాలని… తర్వాత కార్పెటింగ్‌ పనులు పూర్తిచేయాలని చెప్పారు.

ఈ సమీక్షలో సీఎం….విమర్శలకు తావివ్వకుండా చక్కటి రహదారులు వాహనదారులకు అందుబాటులోకి రావాలని అన్నారు. ఎన్‌డీబీ ప్రాజెక్ట్‌లలో టెండర్లు దక్కించుకుని పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని సూచించారు. 2022 జూన్‌ కల్లా రాష్ట్రంలో రహదారుల మరమ్మత్తులు, పునరుద్దరణ పూర్తికావాలని అన్నారు. రాష్ట్రం మొత్తం రహదారుల మరమ్మత్తులు ఒక డ్రైవ్‌లా చేపట్టి…రాష్ట్రంలో ఏ రోడ్లు కూడా గుంతలు లేకుండా ఉండేలా చేయాలని జగన్ చెప్పారు.

Also Read :Speakers Conference : రేపటి నుంచి 3 రోజుల పాటు సిమ్లాలో స్పీకర్ల సద్ససు

ఎక్కడా పాట్‌ హోల్స్‌ మిగిలిపోకుండా అన్ని రోడ్ల మీద అన్ని చోట్లా గుంతలు పూడ్చాలి….స్పెసిఫిక్‌ రోడ్లు కాకుండా రాష్ట్రం మొత్తం చేయండి, ఎక్కడా ప్యాచ్‌ కనిపించకూడదు, మేం అన్ని చేశామనే మెసేజ్‌ వెళ్ళాలి.. ఏ రోడ్డు అయినా సరే మునిసిపాలిటీ, కార్పొరేషన్‌ అయినా సరే ఎవరి పరిధిలో ఉన్నా వెంటనే మరమ్మత్తులు చేయాలని ఆయన అధికారులకు చెప్పారు. మున్సిపాలిటీలలో, కార్పొరేషన్‌లలో కూడా గుంతలు లేని రోడ్లు ఉండాలి.

నాడు-నేడు తరహాలో ప్రతీ రోడ్డు కూడా ఫోటోలు ఉండాలి, రోడ్లు రిపేర్‌ చేసేముందు ఫోటోలు తీయండి, తర్వాత రిపేర్‌ చేసిన తర్వాత కూడా ఫోటోలు తీయాలని సూచించారు. కొత్త రోడ్ల నిర్మాణం కన్నా ముందు రిపేర్లు, మెయింటెనెన్స్‌ మీద ముందు దృష్టి పెట్టండి..నిధులకు సంబంధించి అధికారులు యాక్షన్‌ ప్లాన్‌ సిద్దం చేయండి.. వచ్చే నెలలో కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ రాష్ట్రానికి వస్తున్న క్రమంలో ఈ లోపు ఏపీకి సంబంధించి పెండింగ్‌ ప్రాజెక్ట్‌ల వివరాలను ఆయన దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని  సీఎం  జగన్ అధికారులను ఆదేశించారు.

ట్రెండింగ్ వార్తలు