Speakers Conference : రేపటి నుంచి 3 రోజుల పాటు సిమ్లాలో స్పీకర్ల సద్ససు

రేపటి నుంచి 3 రోజుల పాటు సిమ్లాలో స్పీకర్ల సద్ససు జరుగుతుందని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. 

Speakers Conference : రేపటి నుంచి 3 రోజుల పాటు సిమ్లాలో స్పీకర్ల సద్ససు

Speakers Conference

Speakers Conference :  రేపటి నుంచి 3 రోజుల పాటు సిమ్లాలో స్పీకర్ల సద్ససు జరుగుతుందని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు.   రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు అధ్యక్షతన ఈనెల 16 నుంచి 18వరకు జరిగే సదస్సులో దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు, శాసన మండళ్ళ  చైర్మన్లు పాల్గోంటారని ఆయన తెలిపారు.

1921లో జరిగిన మొదటి సదస్సు కూడా సిమ్లాలోనే జరిగిందని… ఈ సదస్సులో  గత వందేళ్లలో సభలు నిర్వహించిన తీరుపై కూడా చర్చిస్తామని  ఓం బిర్లా చెప్పారు. స్పీకర్ల సదస్సు గురించి బిర్లా మాట్లాడుతూ…. గతంలో జరిగిన సదస్సుల్లో తీసుకున్న నిర్ణయాలను సిమ్లాలో జరిగే సదస్సులో సమీక్షిస్తాము. సభను ప్రజలకు జవాబుదారీగా ఉండేలా, విస్తృతమైన చర్చల ద్వారా ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండేలా తీర్చిదిద్దాలి.

Also Read : Husband Kills Wife : భార్య ప్రవర్తనపై అనుమానం-హత్య చేసి పరారైన భర్త

పార్టీ ఫిరాయింపుల చట్టంలో స్పీకర్లు, చైర్మన్లకు ఉన్న అధికారాల గురించి డెహ్రాడూన్ సదస్సులో చర్చించాము. ఇందులో ఎలాంటి సవరణలు చేయాలన్న అంశంపై చర్చ జరగాలి. ఇప్పటి వరకు స్పీకర్లు, చైర్మన్లకు నిర్ణీత   కాలపరిమితిలోగా నిర్ణయం తీసుకోవాలని ఎక్కడా లేదు. అవసరమైన సవరణల కోసం కమిటీ ఎలాంటి ప్రతిపాదనలు చేస్తుందనేది సిమ్లా సదస్సులో చర్చిస్తామని   ఆయన అన్నారు.

కొత్త పార్లమెంట్ భవనం అనుకున్న సమయానికి నిర్మాణం పూర్తిచేసుకుంటుందని ఓం బిర్లా ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో పనులు కాస్త వెనుకబడ్డాయని….. కానీ ఇప్పుడు ఆ వెనుకబాటును అధిగమించామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తుతాయో ఎవరికీ తెలియదు…. అంతా సానుకూలంగా ఉంటే అనుకున్న సమయంలోగా పార్లమెంట్ నిర్మాణం పూర్తవుతుందని ఓం బిర్లా చెప్పారు.