YS Jagan Telangana High Court notices
YS Jagan Ts High Court notices : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అక్రమాస్తుల కేసులకు సంబంధించిన విచారణలో భాగంగా ఆయనకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. మాజీ ఎంపీ హరిరామ జోగయ్య వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం శుక్రవారం (డిసెంబర్ 15,2023) ఈ మేరకు స్పందించింది.
ప్రజా ప్రతినిధుల కేసులను త్వరితగతిన విచారణ చేయాలని దేశ అత్యున్నత ధర్మాసనం అయిన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో సుమోటో పిల్ గా తీసుకుని ప్రజా ప్రతినిధుల కేసులను విచారణ చేస్తోంది హైకోర్టు. దీంట్లో భాగంగా.. హైకోర్టు విచారణ చేస్తున్న సుమోటో పిల్ తో కలిపి జగన్ అక్రమాస్తుల కేసుల పిటిషన్ ను జత పరచాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది.
జగన్ పై ఉన్న కేసులు విచారణ వచ్చే ఎన్నికలోపు పూర్తి చేయాలి పిటిషనర్ హరిరామజోగయ్య కోరారు. ఇప్పటికే 20 కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని కోర్టు దృష్టికి పిటిషనర్ తీసుకెళ్లారు. దీంతో ధర్మాసనం సీఎం జగన్ కు, సీబీఐకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు నెలలకు వాయిదా వేసింది.
Also Read: ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. ఎన్నికలు ముందే రావొచ్చు!