ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని చెప్పారు జగన్. విపక్షాలు చేసే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు.

CM Jagan On Elections
CM Jagan : ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ముందే రావొచ్చు అని జగన్ అన్నారు. మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్ ఈ కామెంట్స్ చేశారు. 2019తో పోలిస్తే ఈసారి 20 రోజుల ముందే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని జగన్ అభిప్రాయపడ్డారు. ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే ఛాన్స్ ఉందన్నారు.
ఎన్నికలు కొంచెం ముందు వచ్చే అవకాశం ఉందన్న జగన్ తెలంగాణలోనూ 20 రోజుల ముందు ఎలక్షన్స్ వచ్చాయని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం ముందుకు రావాలని అనుకుంటోందన్న సంకేతాలు వస్తున్నాయన్నారు.
Also Read : జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడతకు ఆమోదం.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని మంత్రులతో చెప్పారు జగన్. మంత్రులు క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా పని చేయాలని జగన్ సూచించారు. విపక్షాలు చేసే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. ఎన్నికలకు వైసీపీ పూర్తి సన్నద్ధంగా ఉందని జగన్ స్పష్టం చేశారు.
ఎన్నికలు ముందే జరగొచ్చు అంటూ సీఎం చేసిన కామెంట్లు ఏపీ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ లో ఎన్నికలు రావాల్సి ఉంది. అయితే, ముందే ఎలక్షన్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలోనూ 20 రోజుల ముందే ఎన్నికల షెడ్యూల్ వచ్చిన విషయం విదితమే. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చేందుకు ఆలోచన చేస్తోందని జగన్ అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని మంత్రులకు సూచనలు చేశారు జగన్.
వైసీపీలో చేసిన మార్పులు చేర్పులకు సంబంధించి కూడా క్యాబినెట్ లో చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. పార్టీ బలోపేతం అవడానికి, అనుకున్న టార్గెట్ సాధించేందుకే మార్పులు చేర్పులు ఉంటాయని మంత్రులతో సీఎం జగన్ చెప్పినట్లుగా సమాచారం. డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో మార్పులు చేసి వాళ్లను అలర్ట్ చేసి జనవరి నుంచి పూర్తి స్థాయిలో జగన్ ప్రజల్లోకి వెళ్లేందుకు కసరత్తు చేసుకుంటున్నారు. ఫిబ్రవరిలో షెడ్యూల్ అంటే రెండు నెలల మాత్రమే సమయం ఉంది.
Also Read : కేంద్రంలో మోదీని గద్దె దించాలి.. ఏపీలో జగన్‌ను ఇంటికి పంపాలి : సీపీఐ రామకృష్ణ
ఫిబ్రవరి ఎండింగ్ లో షెడ్యూల్ వస్తే కొంతవరకు పర్లేదు. కానీ, ఇంకా ముందే షెడ్యూల్ వస్తే కనుక సమయం పెద్దగా ఉండదు. కాబట్టి ఎలా చూసినా నెల నుంచి నెలన్నర సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలోపే మార్పులు చేర్పులు అన్నీ పూర్తి చేసుకుని ఎన్నికలకు వెళ్లాలని జగన్ వ్యూహంగా తెలుస్తోంది.
ఒకపక్క ప్రభుత్వానికి సంబంధించిన అనేక కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూనే మరో పక్క పార్టీ పరంగా అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు జగన్. ఇందులో భాగమే వైసీపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జిల మార్పు. 11 మంది ఇంఛార్జ్ లకు సంబంధించి జగన్ మార్పులు చేశారు. ఇక దాదాపు 20 నుంచి 25మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే అవకాశం లేదని వైసీపీ అధిష్టానం నుంచి సంకేతాలు వస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం కంటే ముందే ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు సీఎం జగన్.