AP High Court : పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు చట్టాల ఉపసంహరణ..హైకోర్టులో అఫిడవిట్ దాఖలు

పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు చట్టాల ఉపసంహరణపై కోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.

AP High Court : పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు చట్టాల ఉపసంహరణపై హైకోర్టు ఆదేశాల మేరకు…ప్రభుత్వం..2021, నవంబర్ 26వ తేదీ శుక్రవారం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరపున అఫిడవిట్లను పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై. లక్ష్మీ..కోర్టులో సమర్పించారు. కాపీలను పిటిషనర్లకు పంపారు. ఈ చట్టాల రద్దుపై ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం ఇటీవలే కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశాలపై హైకోర్టులో విచారణ జరుగుతోంది.

Read More : TDP Politburo : బాబు బస్సు యాత్ర, లోకేష్ పాదయాత్ర ?

ఈ నెల 22వ తేదీన ఈ చట్టాలను ఉపసంహరించుకుంటూ శాసనసభలో బిల్లులను ఆమోదించినట్టు అఫిడవిట్లో ప్రభుత్వం పేర్కొంది. తర్వాత నెక్ట్స్ డే 23వ తేదీ శాసనమండలిలో కూడా ఈ బిల్లులను ఆమోద ముద్ర లభించిందని తెలిపింది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం అఫిడివట్లను దాఖలు చేయడం జరుగుతోందని తెలిపారు. రెండు బిల్లుల కాపీలను అఫిడవిట్లతో కలిపి దాఖలు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Read More : Dharwad : 182 మంది విద్యార్థులకు కరోనా, ఫ్రెషర్ పార్టీయే కారణమా ?

పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాల చట్టబద్ధతను మాత్రమే తేలుస్తామని ఇటీవలే హైకోర్టు వెల్లడించిన సంగతి తెలిసిందే. రాజధానులు, సీఆర్‌డీఏ చట్టం రద్దుకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుంటూ కేబినెట్ తీర్మానం అనంతరం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. చర్చ తర్వాత.. మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లను ఆమోదించుకుంది. ప్రస్తుతం ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడివిట్ల అనంతరం హైకోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుందో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు