Dharwad : 182 మంది విద్యార్థులకు కరోనా, ఫ్రెషర్ పార్టీయే కారణమా ?

182 మంది వైరస్ బారిన పడినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. దీనికంతటికీ కారణం... ఫ్రెషర్ పార్టీ నిర్వహించడమే కారణమని తెలుస్తోంది.

Dharwad : 182 మంది విద్యార్థులకు కరోనా, ఫ్రెషర్ పార్టీయే కారణమా ?

Corona

Medical College In Dharwad : కరోనా వైరస్ ఇంకా భయపెడుతోంది. కేసుల సంఖ్య తగ్గుతున్న క్రమంలో..మరలా వైరస్ పంజా విసురుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కేసుల సంఖ్య పెరగడానికి కారణం…ప్రజలు నిర్లక్ష్యంగా ఉండడమేనని నిపుణులు వెల్లడిస్తున్నారు. తాజాగా..ఓ కాలేజీలో విద్యార్థులు కరోనా వైరస్ బారిన పడడం కలకలం రేపుతోంది. ఒక్కరు కాదు..ఇద్దరు కాదు..ఏకంగా 182 మంది వైరస్ బారిన పడినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. దీనికంతటికీ కారణం… ఫ్రెషర్ పార్టీ నిర్వహించడమే కారణమని తెలుస్తోంది. ఈ ఘటన కర్నాటకలోని ధార్వాడ్ మెడికల్ కాలేజీలో చోటు చేసుకుంది.

Read More : TDP Woman Leader Suicide Attempt : పోలీసుల వేధింపులు భరించలేక టీడీపీ నాయకురాలు ఆత్మహత్యాయత్నం

వైరస్ బారిన పడిన వారిలో చాలా మంది రెండు డోసుల టీకా తీసుకున్న వారు కావడం..వీరందరికీ స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని అంటున్నారు. ధార్వాడ్ లోని SDM కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్స్ కాలేజీలో విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. వీరికి కరోనా పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు నిర్వహించిన వారు కరోనా వైరస్ బారిన పడ్డారని తేలింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 2021, నవంబర్ 25వ తేదీ గురువారం కళాశాలలోని దాదాపు 300 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా…తొలుత 66 మంది వైరస్ సోకినట్లు తేలింది.

Read MoreRussia Coal Mine Accident : బొగ్గు గనిలో భారీ పేలుడు..52 మంది దుర్మరణం..పెరగనున్న మృతుల సంఖ్య

మరి కొంతమంది విద్యార్థుల ఫలితాలు 2021, నవంబర్ 26వ తేదీ శుక్రవారం వచ్చాయి. ఇందులో 116 మందికి కరోనా సోకిందని తేలింది. దీంతో మొత్తం 182 మంది విద్యార్థులు వైరస్ బారిన పడ్డారని గుర్తించారు. ప్రస్తుతం వీరంతా..క్యాంపస్ హాస్టళ్లలోనే క్వారంటైన్ లో ఉన్నారని, వీరికి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని అధికారులు వెల్లడిస్తున్నారు. వీరు ఎవరెవరిని కలిశారు ? గుర్తిస్తున్నట్లు, కాలేజీలో ఉన్న 3000 మంది విద్యార్థులు, సిబ్బందికి వైరస్ పరీక్షలు నిర్వహించాలని అధికారులు గుర్తించారు. నవంబర్ 17వ తేదీన నిర్వహించిన ఫ్రెషర్స్ పార్టీయే వైరస్ వ్యాప్తికి కారణమని భావిస్తున్నారు.