Russia Coal Mine Accident : బొగ్గు గనిలో భారీ పేలుడు..52 మంది దుర్మరణం..పెరగనున్న మృతుల సంఖ్య

రష్యాలోని సైబేరియాలో ఉన్న ఓ బొగ్గు గనిలో భారీ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 52మంది మృతి చెందారు.

Russia Coal Mine Accident : బొగ్గు గనిలో భారీ పేలుడు..52 మంది దుర్మరణం..పెరగనున్న మృతుల సంఖ్య

Russia Coal Mine Accident 

Russia Coal Mine Accident  : రష్యాలోని సైబేరియాలో ఉన్న ఓ బొగ్గు గనిలో భారీ ప్రమాదం సంభవించింది. గనిలో గురువారం (నవంబర్ 15,2021) సంభవించిన భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో 52 మంది దుర్మరణంపాలయ్యారు. ఈ దుర్ఘటనపై దేశాధ్యక్షుడు పుతిన్​ తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. గాయపడిన వారికి అన్ని విధాల సాయం అందిచాలని అధికారులను ఆదేశించారు పుతిన్.

రష్యా రాజధాని మాస్కోకు తూర్పున 3,500కిమీ (2,175 మైళ్లు) దూరంలో ఉన్న కెమెరోవో ప్రాంతంలోని లిస్ట్‌వ్యాజ్నాయ గనిలోని స్థానిక కాలమానం ప్రకారం 08:35 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. మంటల ధాటికి వ్యాపించన పొగ వల్ల సహాయక చర్యలు కష్టంగా మారాయి. గనిలో జరగటం వల్ల దుమ్ము ధూళి వ్యాపించాయి. ఈ ధాటికి సైబిరియా గని పొంగతో నిండిపోయింది. 820 అడుగుల లోతులో జరిగిన ఈ ప్రమాదం నుంచి 239 మందిని అధికారులు రక్షించారు. వీరిలో తీవ్రంగా గాయపడిన 44 మందిని ఆసుపత్రికి తరలించారు.గాయపడిన వారిలో కొందరికి స్మోక్ పాయిజనింగ్ ఉందని..దీంతో వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు.

Read more : బంగారం గని కింద 50మంది సజీవ సమాధి

ప్రమాదం జరిగిన సమయంలో తక్షణమే సహాయక చర్యలు చేపట్టినా 52మంది ప్రాణాలు కోల్పోవటం బాధాకరంగా మారింది.కానీ చొరవగా చేపట్టిన సహాయక చర్యల వల్ల 239 మందిని కాపాడగలిగారు. మృతుల్లో 14 మంది మృతదేహాలను గుర్తించారు.ప్రమాదకర మీథేన్​ గ్యాస్​ గని అంతా వ్యాపించటంతో..రెస్క్యూ టీమ్‌లలో ఒకటి గని నుండి బాధితులను కాపాడటానికి పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో సహాయక చర్యల్ని అధికారులు నిలిపివేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో గనిలో చిక్కుకున్న వారు బతికే అవకాశం కూడా లేదని అధికారులు తేల్చిచెప్పారు. మృతుల్లో పలువురు సహాయక సిబ్బంది కూడా ఉన్నట్లు తెలిపారు.ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Read more : Singareni Colleries : సింగరేణి గని ప్రమాదంలో 4కి చేరిన మృతుల సంఖ్య

ఎలాంటి భద్రతా నిబంధనలను పాటించని కారణంగా మైన్​ డైరెక్టర్​ సహా ఇద్దరు సీనియర్​ అధికారులను పోలీసులు అరెస్ట్​ చేసినట్లు సమాచారం.ఈ దుర్ఘటనపై అధ్యక్షుడు పుతిన్​ సంతాపం తెలిపారు. గాయపడిన వారికి అన్ని విధాల సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.బొగ్గు గనుల ప్రమాదాల్లో 2010 తర్వాత ఈ స్థాయిలో ప్రాణనష్టం జరగడం ఇదే తొలిసారి. 2010లో ఓ మైన్​లో జరిగిన ప్రమాదంలో 91 మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ ఘటనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ..ప్రమాదంలో చిక్కుకున్నవారిని ..వీలైనంత ఎక్కువ మందిని రక్షించారని..ఈ ప్రమాదం చాలా దురదృష్టకరమని..ఇది ‘‘పెద్ద విషాదం”గా అని అన్నారు.