బంగారం గని కింద 50మంది సజీవ సమాధి

  • Published By: nagamani ,Published On : September 12, 2020 / 03:29 PM IST
బంగారం గని కింద 50మంది సజీవ సమాధి

బంగారు గనిలో మట్టి పెళ్లలు కూలిపడటంతో 50 మంది చనిపోయారు. కాంగోలో శుక్రవారం (సెప్టెంబర్ 11,2020) ఈ పెను విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాలు కురుస్తుండటంతో ఈ ప్రమాదం జరిగింది. గని కూలిపోయిన సమయంలో బయటకు రాలేక కూలీలంతా అందులోనే సజీవ సమాధి అయిపోయారు. మట్టిపెళ్లల్లో చిక్కుకుపోయిన మృతదేహాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు.



https://10tv.in/raging-fire-breaks-out-in-beirut-port-a-month-after-devastating-explosion/
కమితుగా సమీపంలోని డెట్రాయిట్ గనిలో కొంత మంది తవ్వకాలు చేపట్టారు. అయితే మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో భూమి అంతా నానిపోవటంతో ఒక్కసారిగా మట్టి కూలిపోయింది. అందులోకి వెళ్లిన 50 మంది చిక్కుకుపోయి సజీవంగా సమాధి అయిపోయారు. ఈ ఘటనపై ప్రభుత్వం దిగ్బ్రాంతి వ్యక్తంచేసింది.


కాంగోలోని గునులలో ప్రమాదాలు జరగడం సర్వసాధారణంగా మారిపోయింది. ప్రతి ఏటా పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. కానీ తవ్వకాలు మాత్రం ఆగటంలేదు. గత 2019 అక్టోబర్‌లో గని కూలి 16 మంది చనిపోయారు. అదే సంవత్సం రాగి, కోబాల్ట్ గని కొండచరియలు విరిగిపోయిన సంఘటనలో 43 మంది ప్రాణాలు కోల్పోయారు.