Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. అల్లూరి జిల్లాలోని ఏజెన్సీలో ఉన్న అడవి బిడ్డలకు చిరుకానుక పంపి వారిలో ఆనందం నింపారు. చెప్పులు లేకుండా తిరుగుతున్న ఆదివాసీల పరిస్థితిని అర్థం చేసుకున్న పవన్ కల్యాణ్ తన సొంత డబ్బుతో ఆదుకున్నారు.
ఆదివాసీలకు అండగా ఉంటానని చెప్పిన పవన్ కల్యాణ్.. గ్రామస్తులందరికీ చెప్పులు పంపిణీ చేసి మనసున్న మారాజు అని నిరూపించుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇచ్చిన చిరు కానుక అల్లూరి జిల్లా ఏజెన్సీలో అడవి బిడ్డలకు ఆనందాన్ని ఇచ్చింది. ఈ కాలంలో కూడా చెప్పులు లేకుండా తిరుగుతున్న అక్కడి ప్రజల పరిస్థితిని అర్థం చేసుకున్న పవన్.. చెప్పులను పంపిణీ చేశారు.
Also Read: అంతా నా ఇష్టం- రాజకీయాల్లోకి రీఎంట్రీపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
ఇటీవలే అల్లూరి జిల్లా డుంబ్రిగుడ మండలం పెదపాడు వెళ్లిన పవన్ కల్యాణ్ అడవి తల్లి బాటకు శ్రీకారం చుట్టారు. రిమోట్ ఏరియాలో ఉన్న గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు పవన్. పర్యటన సమయంలో తనతో పాటు నడిచిన గిరిజనుల కాళ్లకు చెప్పులు లేకపోవడాన్ని పవన్ గమనించారు. అది చూసి చలించిపోయిన పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వారందరికీ చెప్పులు కొనివ్వాలని నిర్ణయించారు.
అంతే.. పెదపాడులో గిరిజనుల పాదరక్షల సైజుల వివరాలను తెప్పించుకున్న ఆయన తన కార్యాలయ సిబ్బందితో చెప్పులు పంపిణీ చేయించారు. మొత్తం 345 మందికి పాదరక్షలు పంపించారు. ఇంటింటికీ తిరుగుతూ పాదరక్షలు పంపిణీ చేశారు వాలంటీర్లు, పవన్ కార్యాలయ సిబ్బంది. తమ కోసం డిప్యూటీ సీఎం పంపిన చెప్పులు ధరించి గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు. తమ కష్టం తెలుసుకుని చొరవ తీసుకున్న పవన్ కల్యాణ్ కు గిరిజనులు కృతజ్ఞతలు చెప్పారు.
మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here